రాకపోకల ఆటలో
ఎన్నెన్ని అడుగుల దూరం ఉన్నా
ఇంకొక్క అడుగే అనుకుంటూనో
లేదా అనుకోకుండానో ఆట
అగమ్య గమ్యం
మరొక్క అడుగే అని
ఎవరు అనుకోగలరు
ఎలా తెలుసుకోగలరు
ఆహ్వాన సూర్యోదయాలు
వీడ్కోలు సూర్యాస్తమయాలు
ఎన్ని చూసినా ఇంకా ఎన్ని
ఎదురు చూస్తుంటాయో
అడుగడుగూ
తీరానికి చేరువవుతూనే ఉన్నా
తీరంలో ఇంకిపోతున్నా
వస్తూ పోతున్న
అలల దారే అందరిదీ
ముకుంద రామారావు: 99083 47273