గడ్డిపోసల నడుమ
గలగలా సప్పుడుజేస్కుంటా
పొలం గట్ల పొంటి
కాళ్లకు గజ్జెకట్టినట్టే…
నీళ్లు నాట్యం జేస్తున్నయి.
ఆకలి దప్పులతో ఉన్న
వరి గొలుసులు
కడుపార దూపదీర్సుకొని
ఈనుతున్న వేళ…
శ్రీమంతం జేస్కున్న
కొత్త పెండ్లి కూతురుకు
గర్భస్రావమైనట్టు
వడగండ్ల దెబ్బకు
వరిగొలుసులు కుప్పకూలినయి..
కడుపున వుట్టిన పండంటి బిడ్డకు
నడమంత్రపు రోగమొస్తే తల్లి ఎంత తల్లడిస్తదో…
నేలరాలిన వరి గొలుసులను జూస్కుంటా..
రైతన్న అట్లనే తల్లడిల్లుతున్నడు…
ఎప్పుడు తవ్వుదామా? అని ఎదురుజూస్తున్న
గోతికాడి నక్కలు పకపకా నవ్వుతున్నయి..
ఓ రైతన్నా…
నీ ఏడుపు దేశానికే అరిష్టం…
ముందుగాల్లనైతే ఈ సద్దిబువ్వ తినుమని
సద్దిగట్టుకచ్చిండు సారు…
పెరుగన్నం తిన్న రైతన్న
సలాం జేసే సక్కదనాల సారుకు…
అజ్జిరం