Abhishek Sharma: ఆస్పత్రిలో అభిషేక్ శర్మ.. నమీబియాతో మ్యాచ్‌లో ఆడేది డౌటే !
Abhishek Sharma: అభిషేక్ శర్మ ఆస్పత్రి పాలయ్యారు. కడుపు ఇన్ఫెక్షన్ వల్ల అతన్ని ఆస్పత్రిలో చేర్పించారు. ఢిల్లీలోని ప్రైవేటు ఆస్పత్రిలో అతను చికిత్స పొందుతున్నాడు. అయితే టీ20 వరల్డ్‌కప్‌లో నమీబియాతో జరిగే మ్యాచ్‌లో ఆడేది అనుమానంగా ఉన్నది.
ముంబై : ఇండియన్ ఓపెనింగ్ బ్యాటర్ అభిషేక్ శర్మ(Abhishek Sharma) ఆస్పత్రి పాలయ్యారు. కడుపు ఇన్ఫెక్షన్ వల్ల అతన్ని ఆస్పత్రిలో చేర్పించారు. దీంతో అతను టీ20 వరల్డ్‌కప్‌లో నమీబియాతో జరిగే మ్యాచ్‌లో ఆడేది అనుమానంగా ఉన్నది. గ్రూప్ స్టేజ్‌లో గురువారం నమీబియాతో మ్యాచ్ జరగాల్సి ఉన్నది. అయితే అమెరికాతో మ్యాచ్ జరగడానికి ముందు కూడా అతని ఆరోగ్యం సరిగా లేదని తెలిసింది. మ్యాచ్ ఆడిన తర్వాత అభిషేక్ ఆరోగ్యం క్షీణించినట్లు తెలిసింది. అధిక ఉష్ణోగ్రతలతో అతను బాధపడ్డాడు. అమెరికాతో మ్యాచ్ ముందు అతనికి రిలీఫ్ మెడిసిన్ ఇచ్చారు.
తాజాగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ప్రాక్టీస్ సెషన్‌కు అతను హాజరుకాలేదు. అభిషేక్‌కు ఇంకా కొన్ని ఉదర సమస్యలు ఉన్నాయని, మరో రెండు రోజుల్లో అతను అందుబాటులోకి వస్తాడని ఆశిస్తున్నట్లు అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డొస్కెట్ తెలిపారు. అమెరికాతో మ్యాచ్‌లో అభిషేక్ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత అతను ఫీల్డింగ్ చేసేందుకు క్రీజ్‌కు రాలేదు. ఆ మ్యాచ్‌లో సంజూ శాంసన్ ఫీల్డింగ్ చేశాడు.
ప్రస్తుతం ఢిల్లీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అభిషేక్ ఎప్పుడు డిశ్చార్జ్ అయ్యేది తెలియదని, అతను నమీబియాతో మ్యాచ్‌లో ఆడేది అనుమానంగా ఉన్నట్లు బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

