Municipal Elections | మున్సిపల్ ఎన్నికల్లో గందరగోళం నెలకొంది. మహబూబ్‌నగర్‌లోని 45వ డివిజన్లో ఓటర్లకు ఇస్తున్న బ్యాలెట్ పేపర్లపై సీరియల్ నంబర్లు, గుర్తులు తారుమారు కావడంపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం అధికార యంత్రాంగం ఇచ్చిన బ్యాలెట్ నమూనా ఒకలా ఉంటే.. పోలింగ్ రోజు మరోలా ఇస్తున్నారని వాపోతున్నారు.
ముందుగా ఇచ్చిన నమూనా బ్యాలెట్లో ముందు ప్రధాన పార్టీల గుర్తులు.. ఆ తర్వాత జనసేన, ఇతర పార్టీల గుర్తులను ఇచ్చారు. కానీ అనూహ్యంగా పోలింగ్ రోజు ఇచ్చిన బ్యాలెట్లో జనసేన పార్టీకి ఒకటో నంబర్ ఇచ్చారు. దీంతో ప్రధాన పార్టీల గుర్తులన్నీ మారిపోయాయి. ఎన్నికలు ప్రారంభమయ్యాక ఇది గమనించిన అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. దీంతో 20 నిమిషాల పాటు పోలింగ్ నిలిచిపోయింది.
అభ్యర్థుల ఆందోళనతో రంగంలోకి దిగిన అధికారులు అభ్యర్థులతో చర్చించారు. సమన్వయంతో ఓటింగ్ ప్రక్రియను పున:ప్రారంభించారు.