Municpal Elections | కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల ఓటింగ్.. 9 గంటలకు పోలింగ్ శాతం ఎంతంటే..
Municpal Elections | రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్ని్కల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు క్యూ కడుతున్నారు.
Municpal Elections | రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్ని్కల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో ఉదయం 9 గంటల వరకు 11.6 శాతం పోలింగ్ నమోదైంది. కాగా, మొత్తం మున్సిపాలిటీల్లో 2,582 వార్డులకుగాను 12 వార్డుల్లో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఒక వార్డులో ఎన్నిక వాయిదా పడగా, మిగిలిన 2,569 వార్డుల్లో పోలింగ్ జరుగుతున్నది. మున్సిపాలిటీల పరిధిలో ఓటర్ల సౌకర్యార్థం 6,017 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా వార్డుల్లో మొత్తం 10,719 మంది అభ్యర్థులు బరిలో నిలిచి తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.
బ్యాలెట్లో మారిన సీరియల్ నంబర్లు.. ఆందోళనలో అభ్యర్థులు
మహబూబ్‌నగర్‌లోని 45వ డివిజన్లో ఓటర్లకు ఇస్తున్న బ్యాలెట్ పేపర్లపై సీరియల్ నంబర్లు మారడంపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం అధికార యంత్రాంగం ఇచ్చిన బ్యాలెట్ నమూనా ఒకలా ఉంటే.. పోలింగ్ రోజు మరోలా ఇస్తున్నారని వాపోతున్నారు.
ముందుగా ఇచ్చిన నమూనా బ్యాలెట్లో ముందు ప్రధాన పార్టీల గుర్తులు.. ఆ తర్వాత జనసేన, ఇతర పార్టీల గుర్తులను ఇచ్చారు. కానీ అనూహ్యంగా పోలింగ్ రోజు ఇచ్చిన బ్యాలెట్లో జనసేన పార్టీకి ఒకటో నంబర్ ఇచ్చారు. దీంతో ప్రధాన పార్టీల గుర్తులన్నీ మారిపోయాయి. ఎన్నికలు ప్రారంభమయ్యాక ఇది గమనించిన అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. అయినప్పటికీ యంత్రాంగం పట్టించుకోలేదు. పై నుంచి అలాగే వచ్చిందని.. తామేమీ చేయలేమంటూ ఎన్నికల అధికారులు చేతులెత్తేశారు. సీరియల్ నంబర్లు మార్చి అలాగే పోలింగ్ కంటిన్యూ చేస్తున్నారు.

Bhupalapally Money
పోలింగ్ బూత్ సమీపంలో రూ.లక్ష స్వాధీనం
మున్సిపల్ ఎన్నికల వేళ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పోలింగ్ కేంద్రం సమీపంలో రూ.లక్ష రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 22వ వార్డులోని పోలింగ్ కేంద్రం సమీపంలోని ఒక బండ కింద డబ్బులు దాచి, ఓటర్లకు పంచుతున్నారని కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నాయకుల చేతిలో ఉన్న డబ్బును పోలీసులు సీజ్ చేశారు.
బీఆర్ఎస్ నాయకులు ఈ డబ్బులను పంచుతున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. బీఆర్ఎస్ అభ్యర్థి బుర్రా సదానందాన్ని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కాగా, కాంగ్రెస్ ఆరోపణలను బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. పట్టుబడిన సొమ్ముతో తమకెలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కావాలనే రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.
మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వం అట్టర్‌ప్లాప్
జనగామలో మున్సిపల్ ఎన్నికలో నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందని ఓటర్లు ఆరోపిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద సరైన ఏర్పాట్లు చేయలేదని వాపోతున్నారు. వృద్ధుల కోసం వీల్ చైర్ కూడా ఏర్పాటు చేయకపోవడంతో వారిని చేతులపైనే మోసుకెళ్లాల్సి వస్తుంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BJP
- BRS
- Congress
- municpal elections
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

