మిత్రతరువు
ఒకానొక కాలపు రుతువుచెట్టు నీడలో చిటికెన వేలుకు అంటిన తడి స్నేహం తను ఆటలో కరిగిపోయిన క్షణాల రుచి మనసుకు అద్దిన మమకారుడు నా బాల్యం సంచిలో ఒదిగిన రెండో పావురం పాటల పతంగి.
ఒకానొక కాలపు రుతువుచెట్టు నీడలో
చిటికెన వేలుకు అంటిన తడి స్నేహం తను
ఆటలో కరిగిపోయిన క్షణాల రుచి
మనసుకు అద్దిన మమకారుడు
నా బాల్యం సంచిలో ఒదిగిన రెండో పావురం
పాటల పతంగి.. ఆటల ఝరీ
నీడలు జరిగినంత సులభంగా
వాడల ప్రేమత్వం జారిపోదు
మాతంగి వాగొడ్డు వానకాలంలో
లంగరేసిన చిట్టిపడవలో
ఒదిగిన జ్ఞాపకాల మాలలు
కలిసి తిరిగిన ఆ రోజులు
సైకిల్ రెండు పయ్యల ముద్రల సాక్షిగా
ఇంకా అక్కడే రాయిచెట్టు
ఆకుల మీద పదిలంగానే ఉన్నవి
పొలం గట్టు మీద గడ్డి చిలుకల పలకరింపుల
తన్మయత్వంలో మనిద్దరి బాల్యం
రెండు ఊహల సమ్మేళనమయ్యేది
గుడిలో వేసిన నాటకాల్లో గొంతెత్తి తీసిన రాగాలు
జీవితపు నడకలయ్యేవి
నాదొక కన్ను నీదొక కన్ను రెండూ జత కలిసి
చూపు తుణీరాల జాతరయ్యేది
రంగుల తెరల కథలు, నవలానాయకుల ‘షాడో’ల
ప్రతిధ్వనులు అన్నీ పరిచితం చేసిన
పెద్దబాలశిక్ష తను
ఇప్పుడు జిట్ట్రెగి శోభలో,
మోదుకువనంలో సంచరించే ఆరుద్ర తీరు
ఒక మెట్టు పైన ప్రజల వైపు
-వేముగంటి మురళి
96765 98465
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MCD: కాలుష్యంపై చర్చ.. ఢిల్లీ మున్సిపల్ సమావేశాల్లో గందరగోళం
‘ప్రజా వీరుడు పండుగ సాయన్న’
కాచారంలో తక్షణమే మైనింగ్ తవ్వకాలు ఆపాలి : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
PM Modi | ఢిల్లీలో మోదీతో పోలండ్ ప్రధాని భేటీ.. ఇండియా-పోలండ్ మధ్య కీలక ఒప్పందాలు
FMG Doctors | ఎఫ్ఎంజీ వైద్యుల నిరసన.. అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

