ఒకానొక కాలపు రుతువుచెట్టు నీడలో
చిటికెన వేలుకు అంటిన తడి స్నేహం తను ఆటలో కరిగిపోయిన క్షణాల రుచి
మనసుకు అద్దిన మమకారుడు
నా బాల్యం సంచిలో ఒదిగిన రెండో పావురం పాటల పతంగి.
కిటికీలు, దర్వాజలు రెక్కలు లేని
ఊహల్ని ఆహ్వానిస్తాయి
బయటి గాలి లోపటి గాలికి మధ్య ఒక అగాధం
ఇల్లు అప్పుడప్పుడు బంధాలతో దూదిలా సాగుతుంది
అక్కరలేని వస్తువుల్లా కొందరు మొగురాలకు అతుక్కుపోతారు