రామచంద్రాపురం,మార్చి11: “పదేండ్ల కేసీఆర్ పాలనలో అన్నివర్గాల ప్రజలు సంతోషంగా బతికారని, పేదల సంక్షేమం కోసం కేసీఆర్ ఎన్నో పథకాలు తీసుకువచ్చారని, ఇప్పుడు రేవంత్‌రెడ్డి పాలనలో ప్రజా సంక్షేమం పక్కనబెడితే పేదల భూములు గుంజుకోవాలి..కమీషన్లు దండుకోవాలి” అన్నట్లు సాగుతున్నదని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని కొల్లూర్ 2బీహెచ్‌కే కేసీఆర్‌నగర్‌లో బుధవారంబీఆర్ఎస్ నాయకుడు మల్లేపల్లి సోమిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందుకు ఆయన హాజరయ్యారు.
హరీశ్‌రావుకు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం పలికారు. ముస్లింల ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఇఫ్తార్‌ను ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో హరీశ్‌రావు మాట్లాడారు. ముస్లింలు రంజాన్ మాసంలో పవిత్రంగా ఉపవాస దీక్షలు ఆచరిస్తారన్నారు. ఇఫ్తార్ విందులు హిందూ ముస్లింల ఐక్యతకు నిదర్శనమన్నారు. ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న యుద్ధ వాతావరణంతో వంట గ్యాస్, నూనె, నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
కేసీఆర్ పాలనలో రంజాన్‌కు దావత్ ఏఇఫ్తార్తో పాటు రంజాన్ తోఫా ఇచ్చామన్నారు. ప్రస్తుత రేవంత్‌రెడ్డి పాలనలో రంజాన్ తోఫా బంద్పెట్టారని విమర్శించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకంతో పాటు రూ.లక్ష కేసీఆర్ ఇస్తే రూ.లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు. ప్రభుత్వ దవాఖానలో ప్రసవించిన బాలింతకు కేసీఆర్ కిట్ ఇస్తే ఇప్పుడు బంద్ పెట్టారని విమర్శించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఆరు గ్యారెంటీలు, 420 హామీల్లో ఏఒక్కటి సరిగ్గా అమలు చేయలేదన్నారు.
కేసీఆర్ సర్కార్ ఫార్మాసిటీ కోసం 13వేల ఎకరాలు సేకరిస్తే ఇప్పుడు ఆ భూములను ఫ్యూచర్‌సిటీ పేరుతో అమ్ముకుంటున్నారని మండిపడ్డారు. ఇటీవల హెచ్‌సీయూకి సంబంధించిన 400ఎకరాలు రాత్రికిరాత్రి బుల్డోజర్లను పెట్టి చెట్లను తొలిగించి జింకలు, నెమళ్లు చంపారని గుర్తుచేశారు. ఉర్దూయూనివర్సిటీ భూములు గుంజుకునే ప్రయత్నం చేశారన్నారు. మూసీ అభివృద్ధి పేరుతో ఎంతో మంది పేదలను నిర్వాసితులను చేస్తున్నారన్నారు. ఖ మ్మం జిల్లా వెలుగుమట్లలో 400ఇండ్లు కూల్చి ఎంతో మంది పేదల ఉసురు పోసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రేవంత్‌రెడ్డికి ప్రజాపాలనపైన ఆలోచన లేదని, హైడ్రాతో పేదల ఇండ్లు కూల్చాలి..భూములు గుంజుకోవాలి, ప్రభుత్వ భూములు అమ్ముకోవాలి, కమీషన్లు దండుకోవాలి అన్నట్లు సాగుతున్నదని విమర్శించారు. అంతకుముం దు 2బీహెచ్‌కే వాసులు ఆయన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావిస్తామని హామీ ఇచ్చా రు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, ఎస్సీ,ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, బీఆర్ఎస్ పటాన్చెరు నియోజకవర్గ ఇన్చార్జి ఆదర్శ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, నాయకులు మెట్టుకుమార్, రాములుగౌడ్, బాబ్జీ, లచ్చిరామ్, రవీందర్‌రెడ్డి, శ్రీశైలం, నాగరాజు, ఉమేశ్, దేవేందర్‌యాదవ్, కాల్వగడ్డ రాజ్‌కుమార్, శ్రీపాల్‌రెడ్డి, దయాకర్‌రెడ్డి, వెంకటేశంగౌడ్, అంజయ్య, బుచ్చిరెడ్డి, శ్రీకాంత్‌గౌడ్, సాగర్, పరమేశ్, బాలయ్య, దేవేంద్రాచారి, మేరాజ్‌ఖాన్, మహిపాల్, పృ థ్వీ, సాయిచరణ్, కొమురయ్య పాల్గొన్నారు.