బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆదేశాల మేరకు బుధవారం కోకాపేట నియోపోలిస్‌లో నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న భాగ్యలక్ష్మి మినరల్స్ క్రషర్ల క్వారీని బీఆర్ఎస్ నిజనిర్ధారణ కమిటీ బృందం బుధవారం సందర్శించింది. ముఖ్యమంత్రి మేనల్లుడికి సంబంధించిన ఈ క్రషర్లను అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నదని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆరోపించారు.
ప్రకృతి సంపదను కొల్లగొడుతూ.. ఎలాంటి అనుమతులు పొందకుండా కేవలం సీఎం రేవంత్‌రెడ్డి అనుమతులతో కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. ఈ బృందంలో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌తో పాటు బీఆర్ఎస్ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. -మణికొండ, మార్చి 11