జ్ఞాపకాల కాపలా
కిటికీలు, దర్వాజలు రెక్కలు లేని ఊహల్ని ఆహ్వానిస్తాయి బయటి గాలి లోపటి గాలికి మధ్య ఒక అగాధం ఇల్లు అప్పుడప్పుడు బంధాలతో దూదిలా సాగుతుంది అక్కరలేని వస్తువుల్లా కొందరు మొగురాలకు అతుక్కుపోతారు
కిటికీలు, దర్వాజలు రెక్కలు లేని
ఊహల్ని ఆహ్వానిస్తాయి
బయటి గాలి లోపటి గాలికి మధ్య ఒక అగాధం
ఇల్లు అప్పుడప్పుడు బంధాలతో దూదిలా సాగుతుంది
అక్కరలేని వస్తువుల్లా కొందరు మొగురాలకు అతుక్కుపోతారు
పండుగకు సున్నం వేయించినప్పుడల్లా
పెచ్చులూడిన గోడలోపటి దుఃఖం
కండ్లముందు కదులుతుంది
కొన్ని మూలలు ఉరుపుల గుర్తులతో
చిదిమేసిన ఉమ్మెత్త పువ్వులాంటి
మరకలతో కనిపిస్తుంది
దిగూళ్లు దిగులుతో ఖాళీ అయిపోయి ఉంటాయి
మొలకు ఊగుతున్న పగిలిన అద్దం
బాల్యం నుంచి యవ్వనం దాకా అన్ని దశల్నీ
ఒడిసిపట్టుకొని ఉంటుంది
పళ్ళు విరిగిన దువ్వెనకు చిక్కుకున్న తెల్లవెంట్రుకలు
ఇంటి పెద్ద అనుభవాన్ని పరిచయం చేస్తయి
దూలలమీద గూడు కట్టుకున్న పిచ్చుకల కిచకిచలు
పలకమీద అక్షరాల్ని దిద్దిస్తాయి
గూనలమీద పడి జారిన వానచినుకులు
మనసుకు నిరందిని కలిగించిన నేస్తాలు
ఇంత పదునులో వంటింట్లో నుంచి
అమ్మలవో, అక్కలవో, భర్త వదిలిపెట్టిన మేనత్తలవో
కంటికి తెలియని దుఃఖాలు సలసల మసిలే
అన్నంలో కలిసిపోతాయి
కిటికీలు, దర్వాజలు కొన్నిసార్లు సంతోషాలని మూసేస్తాయి
అతిథులు ఋతువిరుద్ధ పక్షులు
పలకరింపు విరుపుల తూనీరాలు
బాధలతెట్టెల్నిపిండి మరచిపోని రోజుల్ని
నవారు మంచాలకు అతికించి పోతారు
సుద్దముగ్గు రాలిన కడప సుదీర్ఘసాక్షి
గతం, వర్తమానం మట్టిగోడకు అల్లుకున్న బీర, కాకరతీగలు
కొమ్మల్లో తలదాచుకునే పండుటాకులు ముసలితనాలు
ఊసులు వాసాలకు కట్టిన పెళ్ళినాటి బాసింగంలా ఊగుతుంటే
కనురెప్పకొట్టని ఇంటికి జ్ఞాపకాల కాపలా
-వేముగంటి మురళి
96765 98465
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MCD: కాలుష్యంపై చర్చ.. ఢిల్లీ మున్సిపల్ సమావేశాల్లో గందరగోళం
‘ప్రజా వీరుడు పండుగ సాయన్న’
కాచారంలో తక్షణమే మైనింగ్ తవ్వకాలు ఆపాలి : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
PM Modi | ఢిల్లీలో మోదీతో పోలండ్ ప్రధాని భేటీ.. ఇండియా-పోలండ్ మధ్య కీలక ఒప్పందాలు
FMG Doctors | ఎఫ్ఎంజీ వైద్యుల నిరసన.. అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

