కౌన్ బనేగా కరోడ్ పతి..
ఆప్షన్లు ఎన్నైనా తీసుకోండి అవమానం తాకని గుండె ఏదో చెప్పండి గోడకు గడియారం చూసుకోకుండా గడిపిన ఘడియలు ఎన్నో చెప్పండి
ఆప్షన్లు ఎన్నైనా తీసుకోండి
అవమానం తాకని గుండె ఏదో చెప్పండి
గోడకు గడియారం చూసుకోకుండా
గడిపిన ఘడియలు ఎన్నో చెప్పండి
నిన్ను నువ్వు నిండార కూచోబెట్టి
నాల్గు మాటలు చెప్పుకున్నది ఎప్పుడో చెప్పండి
నీలో నువ్వే మనసారా నవ్వుకుని
కండ్లు వర్షించింది ఎప్పుడో చెప్పండి
ఫోన్ చేసి మిత్రున్ని అడగండి
బతుకుతున్న జీవిని ఒక్కటి చెప్పండి
ముల్లుల్ని ఏరుకుంటూ
రక్తాన్ని తుడుచుకోనిది ఎవరో చెప్పండి
గాయాలన్నీ కట్లు కట్టుకొని
కొత్త చొక్కాతో కప్పేసుకోనిది ఎవరో చెప్పండి
డిస్ట్రబ్ చేసే వార్తలను డిలీట్ చేయలేక
మదిని పసుపునీళ్ళతో తడపనిది ఎవ్వరో చెప్పండి
ఎలిమినేట్ చేసి చెప్పండి
ఎవరు నీవైపు ఉన్నారో చెప్పండి
అవసరాలు చూడకుండా
అక్కున చేర్చుకునేది ఎవ్వరో చెప్పండి
నీ పేరు ముందూ వెనకాల తొడుగుల్ని కాకుండా
నిన్ను మాత్రమే గుర్తించే ఒక్కరిని చెప్పండి
నీ వెనకాల నీ తప్పుల్ని తవ్వని
నరుడిని వెతికి వెతికి చెప్పండి
జవాబు చెప్పకున్నా
నువ్వు కరోడ్పతివే
ఆలోచించడం మొదలు పెట్టావు కదా
అది చాలు గెలిచినట్లే…
-దాసరి మోహన్
99853 09080
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

