Swayambhu Teaser | యోధుడిగా నిఖిల్.. ‘స్వయంభు’ టీజర్ విడుదల
Swayambhu Teaser | యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా 'స్వయంభు'.
Swayambhu Teaser | యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘స్వయంభు’. సమ్మర్ కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా.. ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం నేడు విడుదల చేసింది. పాన్ ఇండియా స్థాయిలో అత్యున్నత సాంకేతిక విలువలతో, 3D ఫార్మాట్లో రూపొందిన ఈ టీజర్ ప్రేక్షకులను కట్టిపడేస్తోంది.
భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నిఖిల్ క్రీస్తుశకం 985 నాటి పరాక్రమవంతుడైన యోధుడిగా కనిపిస్తున్నారు. భారీ సెట్టింగ్‌లు, అద్భుతమైన పీరియడ్ వార్ సీక్వెన్స్‌లతో కూడిన ఈ టీజర్, నిఖిల్ మేకోవర్ మరియు ఆయన యుద్ధ విన్యాసాలను అద్భుతంగా ఆవిష్కరించింది. సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి ‘కేజీఎఫ్’, ‘సలార్’ చిత్రాల ఫేమ్ రవి బస్రూర్ సంగీతాన్ని అందిస్తుండగా, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.కె. సెంథిల్ కుమార్ విజువల్స్ సమకూర్చారు. ‘కార్తికేయ-2’ విజయం తర్వాత నిఖిల్ నటిస్తున్న ఈ చిత్రంపై టాలీవుడ్‌తో పాటు దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

