(SRM AP) అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని ఎస్ఆర్ఎం యూనివర్శిటీ ఈ నెల 18 న మెషీన్ లెర్నింగ్‌పై వర్చువల్ సింపోజియం నిర్వహించనున్నది. ఈ మేరకు విశ్వవిద్యాలయం ఒక ప్రకటనతో సింపోజియం వివరాలను వెల్లడించింది.
ఏపీ ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం భౌతికశాస్త్రం విభాగం ఆధ్వర్యంలో ‘ఫిజిక్స్‌లో మెషిన్ లెర్నింగ్ మెథడ్స్ అప్లికేషన్స్’ అనే అంశంపై ఒకరోజు వర్చువల్ సింపోజియం నిర్వహిస్తున్నారు. ప్రాథమిక శాస్త్రాలు, ఇంజినీరింగ్ స్ట్రీం విద్యార్థుల కోసం కంప్యూటర్ సైన్స్-ఫిజిక్స్ డొమైన్‌కు చెందిన పలువురు వక్తల ప్రసంగాలు ఉంటాయి. ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన ప్రొఫెసర్ వినీత్ ఎన్ బాలసుబ్రహ్మణ్యం ‘ఎక్స్ప్లెయిన్బుల్ డీప్ లెర్నింగ్: ఓవర్వ్యూ, ట్రెండ్స్ అండ్ ఛాలెంజెస్’ అనే అంశంపై ఉపన్యాసిస్తారు. ఐఐఐటీ హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ గిరీష్ వర్మ ‘డీప్ జెనరేటివ్ మెథడ్స్ అండ్ అప్లికేషన్స్’ అనే అంశంపై, టోక్యో విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ సన్మయ్ గంగూలీ ‘ద డీప్ రిలేషన్ బిట్వీన్ పార్టికల్ ఫిజిక్స్ అండ్ మెషీన్ లెర్నింగ్’ అంశంపై, ‘మెషిన్ లెర్నింగ్ ప్లాస్టిక్ డీఫార్మేషన్ ఆఫ్ క్రిస్టల్స్’ పై ఫిన్లాండ్లోని టాంపేర్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ లాస్సే లార్సన్ ప్రసంగిస్తారు.
ఆసక్తిగల విద్యార్థులు, ఇతరులు రిజిస్ట్రేషన్ లింక్ srmap.zoom.us/webinar/register/WN_jlA49fK5TSaG2mA59D5ynA ను క్లిక్ చేయడం ద్వారా పేర్లను నమోదు చేసుకోవచ్చునని సింపోజియం కన్వీనర్ డాక్టర్ అమిత్ చక్రవర్తి, డాక్టర్ సౌమ్య జ్యోతి బిస్వాస్ తెలిపారు. ఈ సింపోజయంలో పాల్గొనేందుకు ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేదు. అయితే, ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకోవడం తప్పనిసరి. సింపోజియంలో పాల్గొనేవారికి పార్టిసిపేషన్ సర్టిఫికేషన్ జారీ చేయనున్నారు.
చర్మ క్యాన్సర్ ఎందుకు వస్తుందో కారణం తెలిసిపోయింది!
సోరియాసిస్ బాధితులకు గుడ్‌న్యూస్.. శాశ్వత పరిష్కారం దొరికినట్టే
నొప్పి లేని, మచ్చ రాని వీనోట్స్ సర్జరీ
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..