(CPI Ramakrishna) విజయవాడ: అమరావతిని రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలంటూ రైతుల ఆందోళనకు తాము అండగా ఉంటామని సీపీఐ రాష్ట్ర కార్యవర్గం స్పష్టం చేసింది. అమరావతి రైతులు చారిత్రాత్మక ఉద్యమం చేపట్టారని కొనియాడింది. వారి మహా పాదయాత్రకు సంఘీభావంగా రౌండ్ టేబుల్ సమావేశాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది.
రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ గత రెండేండ్లుగా ఉద్యమం జరుగుతున్నదని, ఇకనైనా సీఎం జగన్ కండ్లు తెరిచి చూడాలని కార్యదర్శి కే రామకృష్ణ వ్యాఖ్యానించారు. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించడంపై జగన్ స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అమరావతి కోసం ఆందోళనలు చేస్తున్న రైతులకు తమ పార్టీ అండగా ఉంటుందని స్పష్టంచేశారు.
మిస్ యూనివర్స్ 2021 హర్నాజ్ సంధు ఎవరో తెలుసా?
శృంగార సమయంలో అతిచేస్తే మొదటికే మోసం..!
టెక్ నిపుణులకు కొలువులు ఫుల్.. పుంజుకుంటున్న మొబైల్ టెక్!
భగవద్గీత అసలు ఎందుకు చదవాలి?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..