చెన్నై: తొలి రెండు మ్యాచ్‌ల్లో భారీ విజయాలు అందుకున్న టీమిండియా.. అఫ్గానిస్థాన్‌తో ఆఖరి సవాల్‌కు సిద్ధమైంది. చెన్నై చెపాక్ స్టేడియంలో శనివారం జరిగే మూడో, ఆఖరి వన్డేలోనూ అఫ్గాన్ ను చిత్తు చేసి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్‌లో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్, సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌పైనే అందరి దృష్టి నెలకొంది. విరాట్ కోహ్లీ గాయం నుంచి కోలుకుని తిరిగొస్తే.. కెప్టెన్ గిల్ మళ్లీ ఓపెనర్‌గా రోహిత్ శర్మతో కలిసి బరిలోకి దిగాల్సి ఉంటుంది.
ఈ తీవ్ర పోటీ మధ్య వన్డే జట్టులో తన స్థానాన్ని కాపాడుకోవాలంటే జైస్వాల్ ఈ మ్యాచ్‌లో భారీ ఇన్నింగ్స్ ఆడాల్సిందే. మరోవైపు సీనియర్ ఆటగాడు కేఎల్ రాహుల్ సరికొత్త సవాలును ఎదుర్కొంటున్నాడు. శ్రేయస్ అయ్యర్ రీఎంట్రీతో రాహుల్ తనకిష్టమైన 5వ స్థానాన్ని వదులుకుని 6వ స్థానంలో బ్యాటింగ్‌కు రావాల్సి వస్తోంది. ఐదో నంబర్లో సత్తా చాటిన కేఎల్ ఆరో నంబర్లో 15 మ్యాచ్‌ల్లో 41.5 సగటుతో 332 పరుగులు మాత్రమే చేశాడు.
ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లలో క్రీజులోకి వచ్చే రాహుల్ వేగంగా పరుగులు రాబడుతూ ఫినిషర్ పాత్రకు ఎంతవరకు అలవాటు పడతాడనేది ఆసక్తికరంగా మారింది. ఇక, బౌలింగ్ విభాగంలో పేసర్ హర్షిత్ రాణా గాయం నుంచి కోలుకుని జట్టులో చేరాడు. గత రెండు మ్యాచ్‌లు ఆడిన అర్ష్‌దీప్ సింగ్ స్థానంలో రాణాను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు ఈ పర్యటనలో ఏకైక టెస్టు, గత రెండు వన్డేల్లో పూర్తిగా విఫలమైన అఫ్గాన్ కనీసం ఆఖరి మ్యాచ్‌లోనైనా గట్టి పోటీ ఇచ్చి గౌరవప్రదంగా సిరీస్‌ను ముగించాలని భావిస్తోంది.