ముంబై : ప్రధాని నరేంద్రమోదీ అట్టహాసంగా ప్రారంభించిన నవీముంబై ఎయిర్‌పోర్టు డొల్లతనం బయటపడింది. ప్రారంభించిన కొన్ని నెలలకే రూఫ్‌టాప్ నుంచి నీళ్లు లీక్ అవుతున్నాయంటూ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రూ.19,650 కోట్లతో ప్రారంభించిన ఈ ఎయిర్‌పోర్టును భారత విజన్‌కు రూపం అంటూ 2025 అక్టోబర్‌లో ప్రారంభించినప్పుడు ప్రధాని మోదీ అభివర్ణించారు.
కానీ ప్రారంభించిన ఆరు నెలలకే జూన్ 17న వానలకు నీళ్లు లీక్ అయ్యాయి. ఎయిర్‌పోర్టులోని బ్యాగేజ్ బెల్టులు నంబర్ 5, 6 వద్ద నీళ్లు ధారాళంగా లీక్ అయ్యాయి. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు స్పందిస్తూ.. ఇండియా విజన్, క్వాలిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ స్థాయిలో ఉందో తేలిపోతున్నదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రపంచమంతా సూపర్ టెక్నాలజీతో దూసుకుపోతుంటే మన దేశంలో ప్రాజెక్టులు నాణ్యతా లోపంతో కడుతున్నారంటూ మండిపడుతున్నారు. సమస్యను వెంటనే సరిచేశామని.. ఇప్పుడు వాటర్ లీక్ కావట్లేదని అధికారులు వెల్లడించారు.