– ఐజేయూ బూర్గంపహాడ్ మండల ప్రింట్, ఎలక్రానిక్ మీడియా నూతన కమిటీలు ఎన్నిక
– టీయూడబ్ల్యుజే (ఐజేయూ) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాటేటి వేణుగోపాల్
బూర్గంపహాడ్, ఆగస్టు 04 : జర్నలిస్టుల సంక్షేమంతో పాటు హక్కుల పరిరక్షణకు నూతనంగా ఎన్నికైన కమిటీల బాధ్యులు సమిష్టితో కృషి చేయాలని టీయూడబ్ల్యుజే (ఐజేయూ) రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మాటేటి వేణుగోపాల్ అన్నారు. మంగళవారం బూర్గంపహాడ్ మండల పరిధిలోని మోరంపల్లిబంజర్‌లో ఐజేయూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు జాగు రత్నం అధ్యక్షతన జరిగిన సమావేశంలో నేషనల్ కౌన్సిల్ మెంబర్ మైథిలిరెడ్డి(రమణారెడ్డి), జిల్లా ప్రధాన కార్యదర్శి జనుముల రమేశ్‌తో కలిసి మాట్లాడారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా జర్నలిస్టులు ప్రజా సమస్యల పరిష్కారంలో కీలకపాత్ర పోషిస్తున్నారన్నారు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించడానికి యూనియన్లు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. జర్నలిస్టుల ప్రధాన సమస్యగా ఉన్న ఇండ్లు, ఇళ్ల స్థలాల సమస్యను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలన్నారు. అనంతరం ఐజేయూ బూర్గంపహాడ్ మండల ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ప్రింట్ మీడియా నుంచి ఐజేయూ మండల అధ్యక్షుడిగా జక్కిరెడ్డి మల్లారెడ్డి (ఆంధ్రప్రభ), ప్రధాన కార్యదర్శిగా కోట రమేష్ (ప్రజా ప్రతిభ), కోశాధికారిగా దానూరి శ్రీనివాస్ (నేటి దర్శిని), ఉపాధ్యక్షులుగా పల్లంటి రమేష్ (తెలుగు ప్రభ), కేసుపాక రాజా (మన భద్రాద్రి), సహాయ కార్యదర్శులుగా చేతుల శ్రీనివాస్ (ప్రజా దర్బార్), గార్లపాటి శంకర్ (వే టూ న్యూస్), ఈసీ సభ్యులుగా మచ్చా సురేష్ (ప్రజా జ్యోతి), పల్లంటి హరీష్ (విజయ క్రాంతి) ఎన్నికయ్యారు.
ఎలక్ట్రానిక్ మీడియా మండల అధ్యక్షుడిగా కుందూరు శ్రీనివాసరెడ్డి (6 టీవీ), కార్యదర్శిగా నుసుం సుబ్బారెడ్డి (మహా టీవి), కోశాధికారిగా పోతిరెడ్డి వెంకటరామిరెడ్డి (సాక్షి టీవీ), గౌరవ అధ్యక్షుడిగా ఎన్.రమేష్ (ప్రజా వాణి), ఉపాధ్యక్షులుగా మూల వెంకటరమణారెడ్డి (రాజ్ న్యూస్), బి.రాజా (ఏబీ న్యూస్), సహాయ కార్యదర్శులుగా మహేశ్‌రెడ్డి (ఐ న్యూస్), సుధాకర్ (ఎస్ న్యూస్), సహాయ కోశాధికారిగా బత్తుల రఘు (వీబీ న్యూస్), ఈసీ సభ్యులుగా ఆదినారాయణ (డీఆర్బీ న్యూస్), పేరాల శ్రీనివాస్, వి.సందీప్ (ఫ్లాష్ న్యూస్9) ఎన్నికయ్యారు. ఈ సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ఉపాధ్యక్షులు తాళ్లూరు శ్రీహరి, డొంకన చంద్రశేఖర్, మారుతి శ్రీనివాసరావు, ఐజేయూ ప్రింట్ మీడియా నియోజకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు పిండిగ వెంకట్, బర్ల జోష్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పంపన రమేష్, డివిజన్ కమిటీ కార్యవర్గ సభ్యులు శివ, నర్సింహారెడ్డి, గుర్రం రవి పాల్గొన్నారు.

‘జర్నలిస్టుల సంక్షేమానికి నూతన కమిటీలు సమిష్టిగా కృషి చేయాలి’