Hair Fall | తలస్నానం చేశాక జుట్టును టవల్‌తో గట్టిగా చుట్టేస్తున్నారా? అయితే నిపుణుల హెచ్చరిక మీకోసమే!
Hair Fall | తలస్నానం చేసిన వెంటనే జుట్టును టవల్‌తో గట్టిగా చుట్టేయడం చాలామందికి అలవాటు. కానీ అది మంచి అలవాటు కాదని.. వెంట్రుకలు చిట్లిపోయి, రాలిపోవడానికి అదే ప్రధాన కారణమవుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Hair Fall | తలస్నానం చేసిన వెంటనే జుట్టును టవల్‌తో గట్టిగా చుట్టేయడం చాలామందికి అలవాటు. జుట్టు తొందరగా ఆరిపోతుందనే ఉద్దేశంతో అమ్మమ్మల కాలం నుంచి ఇదే టెక్నిక్‌ను వాడుతున్నారు. కానీ అది మంచి అలవాటు కాదని.. వెంట్రుకలు చిట్లిపోయి, రాలిపోవడానికి అదే ప్రధాన కారణమవుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తల తడిగా ఉన్న సమయంలో జుట్టు అత్యంత బలహీనంగా ఉంటుంది. ఆ సమయంలో జుట్టును రుద్దడం, బలంగా పిండి తుడవడం లేదా టవల్‌తో గట్టిగా చుట్టేయడం వల్ల వెంట్రుకల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. దీనివల్ల జుట్టు రాలడం, చిట్లిపోవడం, పొడిబారడం వంటి సమస్యలు పెరుగుతాయి.
తడి జుట్టు ఎందుకు సున్నితంగా ఉంటుంది
జుట్టు వెలుపలి పొరను క్యూటికల్ అని పిలుస్తారు. జుట్టు తడిగా ఉన్నప్పుడు ఈ రక్షణ పొర కొద్దిగా పైకి లేస్తుంది. దీంతో వెంట్రుకలు మరింత బలహీనంగా మారి సులభంగా దెబ్బతింటాయి. ఇలాంటి సమయంలో టవల్‌తో గట్టిగా రుద్దడం వల్ల వెంట్రుకల మధ్య ఘర్షణ పెరిగి అవి విరిగిపోయే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలికంగా ఇదే కొనసాగితే జుట్టు సహజ మెరుపును కోల్పోతుంది. రెండు చివరలు చిట్లిపోవడం, రఫ్ టెక్షర్, అధిక హెయిర్‌ఫాల్ వంటి సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు.
టవల్‌తో రుద్దడం ఎందుకు ప్రమాదకరం
జుట్టును ఆరబెట్టుకోవడమే కాదు.. ఆరబెట్టుకునే విధానం కూడా చాలా ముఖ్యమని హెయిర్ కేర్ నిపుణులు చెబుతున్నారు. చాలామంది జుట్టు త్వరగా ఆరాలని టవల్‌తో బలంగా రుద్దుతుంటారని తెలిపారు. ఇలా చేయడం వల్ల క్యూటికల్ పొర మరింత దెబ్బతిని వెంట్రుకలు చిక్కులు పడతాయి. ముఖ్యంగా సాధారణ కాటన్ టవల్స్ కొంత గరుకుదనాన్ని కలిగి ఉంటాయి. అవి జుట్టులోని తేమను వేగంగా పీల్చేసి, అవసరమైన సహజ తేమను కూడా తొలగించే ప్రమాదం ఉంది. దీనివల్ల జుట్టు మరింత పొడిగా మారుతుంది.
భారీ టవల్స్ వాడొద్దు
చాలామంది టవల్ బరువు గురించి అస్సలు పట్టించుకోరు. తడి జుట్టు ఇప్పటికే బలహీనంగా ఉంటుంది. అలాంటి సమయంలో భారీ టవల్‌ను ఎక్కువసేపు గట్టిగా చుట్టుకుంటే వెంట్రుకల మూలాలపై అదనపు ఒత్తిడి పడుతుంది. ముఖ్యంగా పలుచటి లేదా బలహీనమైన జుట్టు ఉన్నవారిలో ఇది జుట్టు రాలడాన్ని మరింత పెంచే అవకాశం ఉంది.
జుట్టు ఎలా ఆరబెట్టుకోవాలి
జుట్టును టవల్‌తో గట్టిగా రుద్దడం కంటే.. వెంట్రుకలకు ఉన్న అదనపు నీటిని మెల్లగా పిండటం లేదా టవల్‌తో తేలికగా తట్టడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే సాధారణ కాటన్ టవల్‌కు బదులు మైక్రోఫైబర్ టవల్ లేదా మెత్తని కాటన్ టీషర్ట్‌ను ఉపయోగించడం ఉత్తమమని చెబుతున్నారు. దీనివల్ల వెంట్రుకలపై ఘర్షణ తగ్గి, జుట్టు ఆరోగ్యంగా ఉంటుందని అంటున్నారు.
Read More:
Diabetes | డయాబెటిస్ వచ్చే ముందు చాలా మందిలో కనిపించే లక్షణాలు ఇవే..!
Water | వ్యాయామం చేసే సమయంలో నీళ్లను తాగవచ్చా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

