
(Satyawathi Rathod) తెలంగాణ రాష్ట్ర రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న అనుచిత విధానాలకు నిరసనగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న కార్యక్రమాల్లో కేంద్రంపై చావు డప్పు మోగించాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు. సోమవారం చేపట్టనున్న నిరసన కార్యక్రమాలపై నాయకులు, కార్యకర్తలను సమాయత్తం పరిచేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో మంత్రి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్, జిల్లా నేతలతో కలిసి నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అన్నిచోట్ల పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు పాల్గొని చావు డప్పు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు అందరూ పాల్గొని కేంద్రం అవలంభిస్తున్న రాష్ట్ర వ్యతిరేక విధానాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని కోరారు. వచ్చే యాసంగిలో ఉప్పుడు బియ్యం కొనలేమని కేంద్రం చెప్పిన విషయాన్ని ప్రజలకు చేరేలా ఆందోళనలు చేపట్టాలన్నారు.
అధిక బరువుతో విసిగిపోయారా.. అయితే ఈ పండ్లు తినండి..!
కొవిడ్ వైరస్ చేరిందో.. ఈ మాస్క్ మెరుస్తుంది! కనిపెట్టిన జపాన్ శాస్త్రవేత్తలు
గర్భ సంచిలో గడ్డలు ఎందుకు వస్తాయి.. అలా వస్తే పిల్లలు పుడతారా ?
శృంగార సమయంలో అతిచేస్తే మొదటికే మోసం..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..