అహ్మదాబాద్: బలమైన గాలులకు హోర్డింగ్ ఫ్రేమ్ కూలిపోయింది. ఆ సమయంలో రోడ్డుపై వెళ్తున్న బైకర్, స్కూటీ రైడర్ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Hoarding Frame Falls) గుజరాత్లోని జామ్నగర్లో ఈ సంఘటన జరిగింది. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు రద్దీగా ఉండే రంజిత్సాగర్ రోడ్డుపై ఉన్న హోర్డింగ్ ఫ్రేమ్ బలమైన గాలికి కూలిపోయింది.
కాగా, రోడ్డుపై వెళ్తున్న ఒక బైకర్ కూలుతున్న హోర్డింగ్ ఫ్రేమ్ కింద నుంచి తల ఒంచి తృటిలో వేగంగా వెళ్లిపోయాడు. ఇంతలో ముగ్గురు ప్రయాణిస్తున్న స్కూటీ అక్కడకు చేరుకున్నది. ప్రమాదాన్ని పసిగట్టిన స్కూటీ రైడర్ అకస్మాత్తుగా బ్రేకులు వేశాడు. దీంతో దానిపై ఉన్న ముగ్గురు వ్యక్తులు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. మిగతా వాహనదారులు రోడ్డుకు ఇరువైపులా ఆగిపోయారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
🚨 कुछ seconds पहले – वहाँ गाड़ियाँ थीं।फिर hoarding गिरा।
कुछ seconds का फर्क था।Jamnagar, Gujarat।Busy road।तेज़ हवाएं।
Private school का hoarding।अचानक गिरा।सड़क पर।
गाड़ियाँ निकल चुकी थीं।बाल-बाल बचे।
Hoarding गिरा – हवा से। लेकिन सवाल यह है – हवा से गिरने वाला hoarding… pic.twitter.com/UaPsyEa8Rh
— Rajneeti Tadka 🌶️ (@RajneetiTadka) May 31, 2026