Kalita Majhi | గతంలో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్ మంత్రి
Kalita Majhi | గతంలో పనిమనిషిగా పలు ఇళ్లలో పనులు చేసిన కలితా మాఝీకి అదృష్టం వరించింది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆమెకు మంత్రి పదవి కూడా దక్కింది. సీఎం సువేందు అధికారి కేబినెట్లో సహాయ మంత్రిగా కలితా మాఝీ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు.
కోల్కతా: గతంలో పనిమనిషిగా పలు ఇళ్లలో పనులు చేసిన కలితా మాఝీకి అదృష్టం వరించింది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆమెకు మంత్రి పదవి కూడా దక్కింది. (Kalita Majhi) సీఎం సువేందు అధికారి కేబినెట్లో సహాయ మంత్రిగా కలితా మాఝీ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ‘మోదీజీ నన్ను ఈ ఉన్నత స్థానానికి తీసుకురావడం పట్ల నేను ఎంతో సంతోషంగా ఉన్నా. నేను ఎమ్మెల్యే అవుతానని కలలో కూడా ఊహించలేదు. ఇక మంత్రి అవుతానని అయితే అసలు ఊహించలేకపోయాను’ అని మీడియాతో అన్నారు.
కాగా, 2014 నుంచి బీజేపీ కోసం తాను పని చేస్తున్నట్లు కలితా తెలిపారు. ‘ నేను మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు, నా దృష్టి కేవలం నా సొంత నియోజకవర్గంపై మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు మంత్రిగా మొత్తం రాష్ట్ర బాధ్యత నా భుజాలపై ఉన్నది’ అని ఆమె అన్నారు.
🚨Rising from domestic help to Minister of State in West Bengal! Kalita Majhi’s inspiring journey proves democracy empowers everyone. “I want to work hard for the whole of Bengal,” she says. pic.twitter.com/QfCY5UP4IF
— indiainlast24hr (@indiain24hr) June 1, 2026
మరోవైపు ఆర్థిక ఇబ్బందుల కారణంగా కలితా మాఝీ తన చదువును మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. కుటుంబ పోషణ కోసం పలు ఇళ్లలో పనిమనిషిగా ఆమె పనిచేశారు. ఒకప్పుడు నెలకు కేవలం రూ. 2,500 మాత్రమే సంపాదించారు. ఆమె భర్త ప్లంబర్గా పనిచేస్తుండగా, కుమారుడు పార్థ్ స్కూల్ విద్యార్థి.
అయితే గతంలో పలు ఇళ్లల్లో పనులు చేసిన కలితా మాఝీ తన రాజకీయ ప్రస్థానాన్ని బూత్ స్థాయి కార్యకర్తగా ప్రారంభించారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఆస్గ్రామ్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆమె ఓడిపోయారు. అయినప్పటికీ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రెండో అవకాశం ఇవ్వడంతో ఎమ్మెల్యేగా గెలిచారు. తాజాగా మంత్రి పదవి కూడా ఆమెను వరించింది.
🚨Rising from domestic help to Minister of State in West Bengal! Kalita Majhi’s inspiring journey proves democracy empowers everyone. “I want to work hard for the whole of Bengal,” she says. pic.twitter.com/QfCY5UP4IF
— indiainlast24hr (@indiain24hr) June 1, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

