సిమ్లా: ప్రముఖ పర్యాటక ప్రాంతంలో తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. రెండు వర్గాల మధ్య జరిగిన వివాదం ఘర్షణకు దారి తీసింది. ఈ నేపథ్యంలో పంజాబ్‌కు చెందిన ఒక పర్యాటకుడు గన్‌తో కాల్పులు జరిపాడు. స్థానికుడైన వ్యక్తి కాలికి బుల్లెట్ తగడంతో గాయమైంది. (Kasol Firing) హిమాచల్ ప్రదేశ్‌లోని కుల్లు జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పర్యాటక ప్రాంతమైన కసోల్ పర్యాటకులతో సందడిగా మారింది.
కాగా, శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో ప్రసిద్ధ గ్రీన్ వ్యాలీ హోటల్లో ఒక విషయంపై రెండు వర్గాల మధ్య వాగ్వాదం చెలరేగింది. అది ఘర్షణగా మారడంతో పంజాబ్‌కు చెందిన ఒక పర్యాటకుడు పిస్టల్ తీసి కాల్పులు జరిపాడు. అయితే స్థానికుడైన వ్యక్తి కాలికి తగలడంతో గాయమైంది. దీంతో బాధతో అతడు కుప్పకూలిపోయాడు.
ఆ తర్వాత హోటల్ పార్కింగ్ ప్రాంతం నుంచి ఆ వ్యక్తి బయటకు వెళ్తుండగా కాల్పులు జరిపిన పర్యాటకుడు చేతిలోని గన్‌తో అనుసరించాడు. అతడు మరోసారి పిస్టల్ గురిపెట్టగా పంజాబ్‌కు చెందిన ఇతర పర్యాటకులు అడ్డుకున్నారు. ఇంతలో గాయపడిన వ్యక్తిని మరో స్థానికుడు వీపుపై మోసుకుని అక్కడి నుంచి తీసుకెళ్లాడు. ఆ తర్వాత అతడ్ని ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు కాల్పుల సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. పంజాబ్‌కు చెందిన నలుగురు పర్యాటకులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేశారు. కాల్పులకు కారణం ఏమిటన్నది దర్యాప్తు చేస్తున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
This is from Kasol, one of the last surviving spots for international tourists. Tourists openly aiming guns at people in the middle of the market. The reason is still unknown, but this is where the state of law and order has reached. Guns being pointed at people in broad daylight… pic.twitter.com/5PtW5bLBXR
— Nikhil saini (@iNikhilsaini) May 30, 2026