PoK Man Crosses LoC | సరిహద్దు దాటి ప్రియురాలిని కలిసిన పీవోకే వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
PoK Man Crosses LoC | పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)కు చెందిన ఒక వ్యక్తి సరిహద్దులోని నియంత్రణ రేఖ దాటాడు. జమ్ముకశ్మీర్‌లోని ఊరి సెక్టార్‌లోకి ప్రవేశించి ప్రియురాలిని కలుసుకున్నాడు. ఇది తెలుసుకున్న ఆర్మీ సిబ్బంది ఆ జంటను అదుపులోకి తీసుకున్నారు.
శ్రీనగర్: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)కు చెందిన ఒక వ్యక్తి సరిహద్దులోని నియంత్రణ రేఖ దాటాడు. జమ్ముకశ్మీర్‌లోని ఊరి సెక్టార్‌లోకి ప్రవేశించి ప్రియురాలిని కలుసుకున్నాడు. ఇది తెలుసుకున్న ఆర్మీ సిబ్బంది ఆ జంటను అదుపులోకి తీసుకున్నారు. (PoK Man Crosses LoC) పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ముజఫరాబాద్ జిల్లా పైన్కాడి గ్రామానికి చెందిన జీషన్ అహ్మద్ మీర్ ఆదివారం ఉదయం 9.30 గంటల సమయంలో సరిహద్దులోని నియంత్రణ రేఖను దాటాడు. జమ్ముకశ్మీర్‌లోని ఊరి సెక్టార్‌లోకి అతడు ప్రవేశించాడు. టిలై గ్రామానికి చెందిన ప్రియురాలు ఇరం బానును కలుసుకున్నాడు.
కాగా, ఈ సమాచారం తెలుసుకున్న సిలికోట్ ప్రాంతంలోని భారత ఆర్మీకి చెందిన ‘12 గ్రెనేడియర్స్’ యూనిట్ సిబ్బంది ఆ జంటను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. వారిద్దరి మధ్య ఉన్న వ్యక్తిగత ప్రేమ సంబంధం వల్ల పీవోకే యువకుడు అక్రమంగా జమ్ముకశ్మీర్‌లోకి ప్రవేశించినట్లు ఆర్మీ అధికారులు తెలుసుకున్నారు. ఉగ్రవాదం లేదా గూఢచర్య సంబంధిత కుట్ర లేదని నిర్ధారించారు.
మరోవైపు కట్టుదిట్టమైన భద్రత ఉండే నియంత్రణ రేఖ వెంబడి సరిహద్దును పీవోకే వ్యక్తి ఎలా దాటి జమ్ముకశ్మీర్‌లోకి ప్రవేశించాడో అన్నది ఆర్మీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. జమ్ముకశ్మీర్‌లోని ప్రియురాలిని కలిసేందుకు సరిహద్దు దాటడానికి అతడికి ఎవరైనా సహాయం చేశారా? అన్నది ఆరా తీస్తున్నారు. అయితే ఆ జంట కలుసుకున్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
PoK lover crosses LoC; Apprehended
Zeeshan Ahmad, a resident of Muzaffarabad, Pakistan occupied Kashmir is currently under Indian custody over border violation.
Video ctsy: Shivankpic.twitter.com/pJXWi36CU8 https://t.co/km74GD2hoD
— Sidhant Sibal (@sidhant) May 31, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tamilnadu SIR | తమిళనాడులో సర్ షాక్.. పట్టించుకోకపోవడంతో 50 సీట్లు చేజార్చుకున్న స్టాలిన్ సేన!
Elon Musk | ప్రైమ్ మినిస్టర్ అంబానీ.. ఎలాన్ మస్క్ వ్యంగ్యాస్త్రాలు
Manne Krishank | రూ.80 వేల కోట్ల భూమి 10 వేల కోట్లకే.. 818 ఎకరాలను గుట్టుగా తాకట్టు పెట్టిన రేవంత్ సర్కార్: మన్నె క్రిశాంక్
Land Scam | 818 ఎకరాలు తాకట్టు.. కంచె గచ్చిబౌలి తరహాలో రేవంత్ సర్కార్ మరో భూ బాగోతం
Bigg Boss 10 | కెప్టెన్‌గా సుధీర్ రెడ్డి.. అగ్నిపరీక్ష బ్యాచ్‌కు పెద్ద షాక్!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

