Bloody Romeo | ‘ఓజీ’ తర్వాత డైరెక్టర్ సుజీత్ నాని హీరోగా సినిమాకు ప్లాన్ చేస్తున్నాడని తెలిసిందే. ‘బ్లడీ రోమియో’ టీజర్‌ను కూడా విడుదల చేసి అభిమానులను ఖుషీ చేశాడు సుజీత్ . నాని ప్రస్తుతం ది ప్యారడైజ్ సినిమాను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. అయితే ది ప్యారడైజ్ ఆలస్యమవుతుండటంతో సుజిత్ ఓజీ2 స్క్రిప్ట్ పనులపై ఫోకస్ పెట్టాడని ఈ క్రమంలో ‘బ్లడీ రోమియో’ సైడ్ అయిందన్న వార్తలు కూడా వచ్చాయి. తాజాగా ది ప్యారడైజ్ ఆలస్యం కారణంగా నాని అందుబాటులో ఉండే అవకాశం ఉండటంతో బ్లడీ రోమియో ప్లాన్‌లో మార్పులు చేశారని ఓ వార్త ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.
నెట్టింట కథనాల ప్రకారం అన్నీ అనుకున్నట్టుగా కుదిరితే బ్లడీ రోమియో షూటింగ్ అక్టోబర్‌లో షురూ కానుందని ఫిలింనగర్ సర్కిల్ సమాచారం. లేటెస్ట్ టాక్ ప్రకారం నాని అక్టోబర్ నుంచి డేట్స్ కేటాయించాడట. కథానుగుణంగా సినిమాకు సంబంధించిన ప్రధాన భాగం లండన్‌లో షూట్ చేయనున్నారని తెలుస్తోంది. డీవీవీ ఎంటర్టైన్మెంట్ ఈ ప్రాజెక్టును తెరకెక్కించాల్సి ఉండగా.. పలు కారణాల వల్ల నిహారికా ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో బ్లడీ రోమియో రాబోతుంది. వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
ఇందులో నాని గ్యాంగ్‌స్టర్ నుంచి చెఫ్‌గా మారిన వ్యక్తిగా కనిపించబోతున్నాడని ఇన్సైడ్ టాక్. ది ప్యారడైజ్ థియేటర్లకు ఎప్పుడెప్పుడొస్తుందా అని ఎదురుచూసి నిరాశలో ఉన్న అభిమానులకు బ్లడీ రోమియో సెట్స్ పైకి వెళ్లనుందనే వార్త గుడ్ న్యూస్ అనే చెప్పాలి. రాబోయే రోజుల్లో బ్లడీ రోమియోకు సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి మరి.