ఖమ్మం : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ( Puvvada Ajay Kumar ) ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ దూషిస్తే ఎవర్ని సహించేది లేదని బీఆర్ఎస్ ఖమ్మం నగర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి మాటేటి కిరణ్ కుమార్ ( Kiran Kumar ) స్పష్టం చేశారు. మాజీ మంత్రి పువ్వాడపై అనుచిత పదజాలంతో విమర్శించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త బోడేపూడి రాజాపై ఖనాపురం హవేలి పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
పెద్ద నాయకులను విమర్శిస్తే హీరో అయిపోతామని భ్రమలో మాట్లాడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసి సమాజంలో జీరో కావడం తప్పితే ఎలాంటి ప్రయోజనం ఉండదని, బోడేపూడి రాజా వంటి వ్యక్తుల వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం తప్పితే ప్రయోజనం ఏమీ ఉండదనే విషయాన్ని కాంగ్రెస్ అగ్రనేతలు గమనించాలని అన్నారు. మాజీ కార్పొరేటర్ వలరాజు , బీఆర్ఎస్ యూత్ నాయకులు మోరంపూడి సాయి కృష్ణ, విజేత, హుస్సేన్, సన్నే, మునాఫ్, చోటు పాల్గొన్నారు.