Due Date | ప్రతి మనిషిని ఆలోచింపజేసే కోర్టురూమ్ డ్రామా ‘డ్యూ డేట్’.. మొదలైన షూటింగ్!
ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకునే ఒక ముఖ్యమైన అంశం చుట్టూ అల్లుకున్న సరికొత్త వాణిజ్య కథాంశంతో వస్తున్న చిత్రం 'డ్యూ డేట్'.
Due Date | ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకునే ఒక ముఖ్యమైన అంశం చుట్టూ అల్లుకున్న సరికొత్త వాణిజ్య కథాంశంతో వస్తున్న చిత్రం ‘డ్యూ డేట్’. లోమేష్ పుడిపెద్ది హీరోగా, జయశ్రీ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రణీత పట్నాయక్, విజ్ఞాని తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వరిష్ స్టూడియోస్ పతాకంపై పవన్ తరిగోపుల, ఏలూరు శ్రీను సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ఆనంద్.కె దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్రానికి సంబంధించి తాజాగా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్‌లో ఘనంగా మొదలైంది. ప్రస్తుతం నూతన నటీనటులు, ప్రధాన తారాగణంపై అత్యంత కీలకమైన సన్నివేశాలను చిత్రకరిస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ చర్చించుకునే అత్యంత ముఖ్యమైన బర్నింగ్ ఇష్యూ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. కేవలం వినోదం మాత్రమే కాకుండా, ప్రతి మనిషి ఆలోచింపజేసేలా ఈ కమర్షియల్ కోర్ట్‌రూమ్ డ్రామా ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుందని పేర్కొన్నారు. టైటిల్ మొదలుకుని సినిమాలోని ప్రతి సన్నివేశం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని, కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమిదని వారు ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ప్రారంభమైన ఈ తొలి షెడ్యూల్ దాదాపు 15 రోజుల పాటు ఏకధాటిగా కొనసాగనుంది.
ఈ చిత్రానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. కెమెరామెన్‌గా చెంచు జింక వ్యవహరిస్తుండగా, మాటలను హరీష్ మీనన్ అందిస్తున్నారు. ఎడిటర్‌గా సత్య గిడుటూరి, ఆర్ట్ డైరెక్టర్‌గా జవ్వాడి నాయుడు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సినిమాలో సీనియర్ నటుడు కృష్ణభగవాన్ కూడా ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. విభిన్నమైన కథాకథనాలతో హృదయాలకు హత్తుకునే రీతిలో వస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
US Fed Meeting | వడ్డీరేట్లను యథాతథంగా ఉంచిన అమెరికా కేంద్ర బ్యాంక్..!
Srikanth Odela | ‘ది ప్యారడైజ్’ విమర్శలు.. శ్రీకాంత్ ఓదెల నెక్స్ట్ మూవీపై ఆసక్తికర చర్చ!
South Carolina | అణు పరిశోధనా కేంద్రంలో అగ్నిప్రమాదం.. ఎమర్జెన్సీ ప్రకటించిన అధికారులు..!
Story competition | కథల పోటీలో ప్రతిభ చాటిన పావని
Sai Pallavi | ‘రావణుడు పూర్తిగా చెడ్డవాడు కాదు’.. సాయి పల్లవి వ్యాఖ్యలపై నెట్టింట దుమారం!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

