KTR | కేటీఆర్ పాస్‌పోర్టు జప్తు అంటూ తప్పుడు వార్త.. ఈనాడుకు కేటీఆర్ లీగల్ నోటీసులు..!
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పాస్‌పోర్టును తాత్కాలికంగా జప్తు చేయాలని కోర్టు ఆదేశించినట్లు ఈనాడు దినపత్రికలో ప్రచురితమైన వార్తపై కేటీఆర్ లీగల్ నోటీస్ పంపించారు.
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పాస్‌పోర్టును తాత్కాలికంగా జప్తు చేయాలని కోర్టు ఆదేశించినట్లు ఈనాడు దినపత్రికలో ప్రచురితమైన వార్తపై కేటీఆర్ లీగల్ నోటీస్ పంపించారు. సెప్టెంబర్ 29న ప్రచురితమైన ఆ వార్త వాస్తవాలకు విరుద్ధంగా, పాఠకులను తప్పుదోవ పట్టించే విధంగా ఉందని నోటీసులో పేర్కొన్నారు.
కేటీఆర్ తరఫు న్యాయవాది ఎన్. లలితారెడ్డి సెప్టెంబర్ 30న ఈనాడు ఎడిటర్, పబ్లిషర్, ప్రింటర్, రెసిడెంట్ ఎడిటర్, సంబంధిత రిపోర్టర్‌కు న్యాయ నోటీసు పంపించారు. వాస్తవానికి ఏసీబీ దర్యాప్తు అధికారి ప్రత్యేక కోర్టులో కేటీఆర్ పాస్‌పోర్టుకు సంబంధించి తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ మెమో మాత్రమే దాఖలు చేశారని, దానిని కోర్టు ఉత్తర్వుగా పేర్కొనడం సరికాదని నోటీసులో స్పష్టం చేశారు.
కేటీఆర్ పాస్‌పోర్టును తాత్కాలికంగా జప్తు చేయాలని ప్రత్యేక కోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని నోటీసులో పేర్కొన్నారు. అదే సమయంలో రీజినల్ పాస్‌పోర్టు కార్యాలయం సెప్టెంబర్ 28న పాస్‌పోర్టు చట్టంలోని సెక్షన్ 10(3)(e) కింద షోకాజ్ నోటీసు జారీ చేసి, వివరణ ఇచ్చేందుకు 15 రోజుల గడువు ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. కోర్టు ఇప్పటికే పాస్‌పోర్టు జప్తునకు ఆదేశాలు ఇచ్చినట్లు వార్త ప్రచురించడం ద్వారా కేటీఆర్‌పై ప్రజల్లో తప్పుడు అభిప్రాయం కలిగే అవకాశం ఉందని న్యాయవాది పేర్కొన్నారు.
వార్తకు ఆధారమైన సమాచారం, మూలాలు ఏమిటో వెల్లడించాలని, సంబంధిత కోర్టు రికార్డులు లేదా ఆదేశాలను రిపోర్టర్ పరిశీలించారా అనే అంశంపై వివరణ ఇవ్వాలని నోటీసులో కోరారు. అలాగే వార్తకు సంబంధించిన వాట్సాప్ సందేశాలు, ఈమెయిల్స్, నోట్స్, రికార్డింగ్స్, పత్రాలు, డ్రాఫ్ట్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ రికార్డులను భద్రపరచాలని సూచించారు.
ప్రచురితమైన వార్తను తక్షణమే ఉపసంహరించుకుని, అదే ప్రాధాన్యతతో సవరణ ప్రచురించాలని, కేటీఆర్‌కు బేషరతు క్షమాపణ చెప్పాలని న్యాయ నోటీసులో డిమాండ్ చేశారు. ఆన్లైన్, ఈ-పేపర్, వెబ్సైట్, సోషల్ మీడియా, డిజిటల్ ఆర్కైవ్స్లోనూ సంబంధిత వార్తను సరిచేయాలని కోరారు. 48 గంటల్లో తగిన చర్యలు తీసుకోకపోతే సివిల్, క్రిమినల్ పరువునష్టం చర్యలతోపాటు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ఆశ్రయిస్తామని నోటీసులో స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Water Wastage | అటు వృథా..ఇటు కలుషితం..
IndiaNew vs Zealand | తొలి టెస్టులో సత్తా చాటిన భారత బౌలర్లు.. బుమ్రా ఖాతాలో మూడో వికెట్.. కివీస్ 95/5
Dia Mirza | ఆయనతో పనిచేయడం ఓ పీడకల..! దియా మీర్జా సంచలన వ్యాఖ్యలు
Sreeleela | అందుకే టాలీవుడ్‌కు దూరం..! క్లారిటీ ఇచ్చిన శ్రీలీల
Kamal Haasan| సేయాన్లో విరుమాండి గెటప్.. అతిథి పాత్రలో కనిపించనున్న కమల్‌హాసన్..!
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

