NRI BRS UK | లండన్‌లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం..!
NRI BRS UK : ఎన్నారై బీఆర్ఎస్ యూకే ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు జన్మదిన వేడుకలను లండన్‌లో ఘనంగా నిర్వహించారు.
NRI BRS UK : ఎన్నారై బీఆర్ఎస్ యూకే ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు జన్మదిన వేడుకలను లండన్‌లో ఘనంగా నిర్వహించారు. ముందుగా తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరించుకుంటూ రెండు నిమిషాల మౌనం పాటించి ఘన నివాళులు అర్పించారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసిన ఎన్నారై బీఆర్ఎస్ యూకే నాయకులు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఉపాధ్యక్షులు హరి గౌడ్ నవాపేట్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అమరవీరుల త్యాగాలు, ప్రజల చిరకాల ఆకాంక్షలు, కేసీఆర్ నాయకత్వంలో సాగిన ఉద్యమ ఫలితమని అన్నారు. తెలంగాణ సాధన కోసం పోరాడిన ప్రతి ఒక్కరిని స్మరించుకుంటూ, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణవాసులంతా కలిసి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఉపాధ్యక్షులు సత్యమూర్తి చిలుముల మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రవాసులు రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడం ఎంతో ముఖ్యమని అన్నారు. విదేశాల్లో ఉన్నప్పటికీ తెలంగాణతో ఉన్న అనుబంధాన్ని మరింత బలోపేతం చేస్తూ సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని ఆయన కోరారు.

యూత్ వింగ్ నాయకురాలు అమరేశ్వరి బోయిన మాట్లాడుతూ.. మా తరానికి తెలంగాణ ఉద్యమ చరిత్రను, కేసీఆర్ పోరాట విషయాల్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉండాలని కోరారు. చరిత్ర తెలియక చాలామంది చౌకబారు రాజకీయ విమర్శలు చేస్తున్నారని, ప్రతీ సంవత్సరం రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు, కేసీఆర్‌పై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేలా మనమంతా కృషి చెయ్యాలని, పార్టీ సైతం చొరవ తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

Nri
హరీశ్ రావు జన్మదినం
రాష్ట్రావతరణ వేడుకలతో పాటు మాజీ మంత్రి హరీశ్ రావు జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. జనరల్ సెక్రటరీ రత్నాకర్ కడుదుల మాట్లాడుతూ.. మాజీ మంత్రి హరీశ్ రావు ప్రజలతో మమేకమై పనిచేసే నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు పొందారని అన్నారు. ఆయన జన్మదిన సందర్భంగా ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

ఎన్నారై బీఆర్ఎస్ యూకే నాయకులు అంజాన్ రావు మాట్లాడుతూ.. మాజీ మంత్రి హరీష్ రావు ప్రోత్సాహం మరువలేనిదని, ఎప్పటికప్పుడు మమ్మల్ని ప్రోత్సహిస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న తెలంగాణ ప్రజా నాయుకుడు హరీష్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షులు నవీన్ రెడ్డి నాయకత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు హరి గౌడ్ నవాపేట్, సత్యమూర్తి చిలుముల, జనరల్ సెక్రటరీ రత్నాకర్ కడుదుల, కార్యదర్శి (ఐటీ, మీడియా & పీఆర్) రవి ప్రదీప్ పులుసు, వెంకట్ రెడ్డి దొంతుల, సురేష్ బుడగం, రామకృష్ణ, పవన్ గౌడ్, అంజన్ రావు, అమరేశ్వరి, హరికృష్ణ, రాజు, సాయి, జగదీశ్ తదితరులు పాల్గొన్నారు. ప్రవాస తెలంగాణవాసులు, పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

