(Inter classes) హైదరాబాద్: ఇంటర్మీడియట్లో ఆర్ట్స్, హ్యుమానిటీస్ వంటి కోర్సుల్లో విద్యార్థులు కాలేజీకి వెళ్లకుండానే ఫైనల్ పరీక్షలకు హాజరుకావొచ్చు. ఇలాంటి అవకాశాన్ని చాలా కాలంగా ఇంటర్ బోర్డు అమలుచేస్తున్నది. సైన్స్ విద్యార్థులకు ఇలాంటి మినహాయంపు వర్తించదు. అయితే, ఇలా హాజరు మినహాయింపు కోరుకునే విద్యార్థులు రూ.500 చెల్లించి దరఖాస్తు సమర్పించాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 5 వ తేదీలోగా ఈ మొత్తం చెల్లించి హాజరుశాతం నుంచి మినహాయింపు పొందవచ్చని ఆయన పేర్కొన్నారు. రూ.200 ఆలస్య రుసుంతో 2022 జనవరి 18వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఇలా హాజరు నుంచి మినహాయింపు పొంది పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులను ప్రైవేట్ విద్యార్థులుగా పరిగణిస్తామని, ఇతర వివరాల కోసం tsbie.cgg.gov.in వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు.
అధిక బరువుతో విసిగిపోయారా.. అయితే ఈ పండ్లు తినండి..!
కొవిడ్ వైరస్ చేరిందో.. ఈ మాస్క్ మెరుస్తుంది! కనిపెట్టిన జపాన్ శాస్త్రవేత్తలు
గర్భ సంచిలో గడ్డలు ఎందుకు వస్తాయి.. అలా వస్తే పిల్లలు పుడతారా ?
శృంగార సమయంలో అతిచేస్తే మొదటికే మోసం..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..