బడికెందుకు పోలేదని తల్లి మందలించినందుకు ఓ బాలిక మనస్థాపం చెంది ఆత్మహత్యా యత్నం చేసుకుని మంగళవారం మృతి చెందిన ఘటన సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో జరిగింది.
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ గెలిచాక ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పి..ఇప్పుడు బీర్ల తయారీకి నోటిఫికేషన్ ఇవ్వడం విడ్డూరంగా ఉందని వామపక్ష యువజన సంఘాల నాయకులు అన్నారు.
అధికారులు యూరియా పంపిణీ చేయడం లేదని నిరసిస్తూ రైతులు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలోని సింగిల్ విండో కార్యాలయం ఎదుట ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.
మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని మోడల్ స్కూల్ హాస్టల్తో పాటు ముత్యంపల్లి ప్రాథమిక పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్. యాదయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు.
త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పార్టీ శ్రేణులు సైనికుల్లా పని చేయాలని ఆ పార్టీ పెగడపల్లి మండలాధ్యక్షుడు లోక మల్లారెడ్డి పిలుపునిచ్చారు.
బతుకమ్మ కుంటలో ఆరు రోజుల క్రితం కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా గిరక తాటి మొక్కలు నాటారు. ప్రస్తుతం ఆ మొక్కలు రక్షణ లేక విరిగి ఎండిపోయిన దుస్థితిలో కనిపిస్తున్నాయి.
ఖాయిలా పడిన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) ఆదిలాబాద్ ప్లాంటును పునురుద్ధరించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.