హైదరాబాద్ : వరంగల్ తూర్పు ఎమ్మెల్యే, మంత్రి కొండా సురేఖపై నియోజకవర్గ ప్రజలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. గెలిచినప్పటి నుంచే ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదని, కనీసం మంత్రి ముఖం చూపించడం లేదని వాపోతున్నారు. రెండేళ్లుగా తాగు నీటి సమస్య పరిష్కరించలేదని ఆరోపిస్తూ వరంగల్ మున్సిపల్ కార్యాలయం ఎదుట 26వ డివిజన్ ప్రజలు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేసీఆర్ ఉన్నప్పుడు తాగు నీరు సమయానికి వచ్చేవి, ఎంజీఎం దవాఖాన కూడా మంచిగ చేసిండు అని గుర్తు చేసుకున్నారు.
గెలిచేంత వరకు రూ.2,500 ఇస్తాం అన్నారు. 4,000 పెన్షన్ ఇస్తాం అన్నారు. గెలిచాక ఎవరూ పట్టించుకో వడం లేదని విమర్శించారు. కొండా సురేఖ గెలిచిన తర్వాత మనిషే కనబడడం లేదన్నారు. మా వాడకి వచ్చి మీకు ఏ సమస్య ఉందని కూడా అడగడం లేదు. మాకు జాబులు ఇస్తానని ఆశ చూపిస్తే కొండా సురేఖకు ఓట్లు వేశాము.. మాకు ఉద్యోగాలు ఇవ్వలేదు. కొండా సురేఖ, కొండా మురళి మాకు ఏం న్యాయం చేయలేదని అసహనం వ్యక్తం చేశారు.