కోరుట్ల, జనవరి 6 : జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని అతి పురాతనమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామివారికి లక్ష పుష్పార్చన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై స్వామివారి ఉత్సవమూర్తులను అలంకరించి ప్రత్యేక పూజలు, అభిషేకార్చనలు జరిపించారు.
వేడుకలకు హాజరైన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు బీర్నంది నరసింహాచార్యులు, ఆలయ కమిటీ అధ్యక్షుడు ఎతి రాజం నరసయ్య, ధర్మకర్తలు, ఆలయ కార్య నిర్వహణ అధికారి విక్రమ్, జూనియర్ అసిస్టెంట్ నరసయ్య, ఆండాళ్ గోష్టి భక్త బృందం, భక్తులు పాల్గొన్నారు.