రాష్ర్టానికి వారంపాటు వానగండం
రాష్ట్రవ్యాప్తంగా కొద్దిరోజులుగా ఎండలు దంచికొడుతుండగా, రాబోయే రోజుల్లో వానగండం పొంచి ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
- 16 నుంచి 23 వరకు కురిసే అవకాశం
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి
హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా కొద్దిరోజులుగా ఎండలు దంచికొడుతుండగా, రాబోయే రోజుల్లో వానగండం పొంచి ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈనెల 16 నుంచి 23 వరకు వారంపాటు రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వెల్లడించింది. ముఖ్యంగా రంగారెడ్డి, కరీంనగర్, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, నల్లగొండ జిల్లాల్లో కొన్నిచోట్ల వడగండ్ల వానలు పడే ప్రమాదం ఉన్నదని హెచ్చరించింది.
ఈనెల చివరి నాటికి ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతాయని, ఏప్రిల్ నెలలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొన్నది. 15 వరకు పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రతలు 33 డిగ్రీల నుంచి 40 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయని పేర్కొన్నది. తెలంగాణ ఉత్తర, తూర్పు జిల్లాలైన ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉన్నదని వెల్లడించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

