పొతంగల్ జనవరి 6 : గ్రామాల అభివృద్ధికి తన వంతు సహకారం ఉంటుందని ఎంపీడీవో చందర్ పేర్కొన్నారు. మంగళవారం నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణలో నూతనంగా ఎన్నికైన గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులను సన్మానించారు. ఈ సందర్బంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచులు, పాలకవర్గ సభ్యులు సమన్వయంతో గ్రామాలను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలని సూచించారు.
అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా పాలకవర్గ సభ్యులు కృషి చేయాలని కోరారు. గ్రామంలోని సమస్యలను గుర్తించి ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ శంకర్, పంచాయతీ కార్యదర్శులు తదితరులు ఉన్నారు.