నిజామాబాద్ : పేదింటిలోని ఆడ బిడ్డల కన్నీళ్లు తుడుచేందుకే నాడు కేసీఆర్ కల్యాణ లక్ష్మి(Kalyana Lakshmi) పథకాన్ని ప్రారం భించారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. మంగళవారం బాల్కొండ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కల్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన నమ్మి ప్రజలు ఆ పార్టీకి ఓట్లు వేశారు.
అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేండ్లు అవుతున్నా ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని విమర్శిం చారు. తులం బంగారం, మహిళలకు రూ.2,500 , పెన్షన్ 4000 రూపాయల హామీలు నెరవేర్చలేదని మహిళా సోదరీమణులు గమనించాలన్నారు. సమయం వచ్చినపుడు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు అయ్యే వరకు ప్రజల పక్షాన ప్రభుత్వంపై పోరాడుతామన్నారు.,