తెలుగువారికి బాగా చేరువైన హీరో కార్తీ. అందుకే తెలుగు రాష్ర్టాల్లో ఆయన సినిమా అంటే మంచి గీరాకి. ఇప్పటికే ‘ఊపిరి’తో నేరుగా తెలుగులో ఓ సారి నటించారు కార్తి. ఇప్పుడు రెండోసారి నటించేందుకు సిద్ధమవుతున్నారు. ‘మ్యాడ్’ ఫ్రాంచైజీ దర్శకుడు కల్యాణ్శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారని తెలుస్తున్నది. ఇటీవలే కార్తీకి కల్యాణ్శంకర్ కథ వినిపించారట. కార్తీకి కూడా కథ బాగా నచ్చిందట.
సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తారని వినికిడి. ఇదిలావుంటే.. గతంలో హీరో రవితేజకు కల్యాణ్శంకర్ ఓ కథ వినిపించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ఇప్పుడు కార్తీకి వినిపించింది కూడా అదే కథ అని ఇన్సైడ్ టాక్. వందకోట్ల బడ్జెట్తో ఈ సినిమా నిర్మిస్తారట.