స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ (Ranabaali) సినిమా నుంచి మేకర్స్ ఒక పవర్ఫుల్ పోస్టర్‌ను విడుదల చేశారు. దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం 1854–1878 కాలంలో రాయలసీమ నేపథ్యంలో బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా సాగే చారిత్రక పోరాటం ఆధారంగా రూపుదిద్దుకుంటోంది. “మరపురాని చరిత్రలోని అత్యంత సాహసోపేతమైన అధ్యాయం” (The bravest chapter of our forgotten history) అనే ట్యాగ్‌లైన్‌తో ఈ పోస్టర్ హైలైట్ అవుతోంది.
ఈ పోస్టర్లో విజయ్ దేవరకొండ రక్తం, మట్టితో కూడిన యుద్ధ వీరుడి రూపంలో కనిపిస్తున్నారు. ఆయన పొడవుగా ఉన్న జుట్టు, మీసం, ఒంటిపై గాయాలు ఈ పాత్ర తీవ్రతను తెలియజేస్తున్నాయి. జాతీయ జెండా ఆయన భుజంపై ఒక యోధుడి కవచంలా కప్పబడి ఉంది. దీనికి ఉన్న రక్తపు మరకలు స్వాతంత్ర్య పోరాటంలోని త్యాగాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన లుక్ వైరల్‌గా మారింది. ఈ చిత్రంలో విజయ్ సరసన రష్మిక మందన్న నటిస్తుండగా, హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ (ది మమ్మీ ఫేమ్) కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
Happy 80th Independence Day 🇮🇳
The bravest chapter of our forgotten history is about to be revealed soon.#Ranabaali @TheDeverakonda @iamRashmika @Rahul_Sankrityn @MythriOfficial #ArnoldVosloo @AjayAtulOnline @nirav_dop #JishnuBhattacharjee #ShivamRao #ArchanaaAkhilRao… pic.twitter.com/Dxpv6HPSlW
— Mythri Movie Makers (@MythriOfficial) August 15, 2026