మహబూబ్ నగర్ : ఎందరో వీరుల త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని, స్వాతంత్య్ర పోరాట స్పూర్తితో తెలంగాణ ( Telangana ) ఉద్యమం కొనసాగి రాష్ట్రాన్ని సాధించుకున్నామని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ( Srinivas Goud ) అన్నారు. బీఆర్ఎస్ మహబూబ్ నగర్ జిల్లా కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేశారు.
మాజీ మంత్రి మాట్లాడుతూ దేశంలో ఇప్పటికి చాలా వర్గాల ప్రజలు చట్టసభల్లో అడుగు పెట్టలేదని, వారు అడుగుపెట్టిన రోజు అన్ని వర్గాలకు ఉపయోగపడే చట్టాలు వస్తాయని పేర్కొన్నారు. అంటరాని తనం, మహిళల పట్ల అత్యాచారాలు, కుల విభేదాలు, విద్వేషాలు ఇంకా కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని కూకటి వేళ్లతో పెకిలించాల్సిన అవసరం ఉందని అన్నారు.
కులమతాలకు అతీతంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని వె ల్లడించారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, పార్టీ పట్టణ అధ్యక్షులు శివరాజ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆంజనేయులు, పార్టీ మహబూబ్ నగర్ మండల అధ్యక్షులు దేవేందర్ రెడ్డి, కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.