KTR | బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌లో భూములు కోల్పోతున్న బహదూర్‌పల్లి రైతులతో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..ఇయ్యాళ్ల కూడా పోలీసోళ్లు వద్దు.. మీ ఫొటోలు తీసుకుంటం. అవన్నీ తీసుకుపోయి ఏం చేస్తరో మరి నాకు తెల్వదు. ఫొటోలు తీసుకుంటమంటే కూడా ధైర్యంగా ఇక్కడికి వచ్చిర్రు. మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు.
పోలీస్ స్టేషన్లో ఫొటోలు పెట్టాలంటే ఎవరివి పెట్టాలే. రౌడీ షీటర్లు, లంగలు, దొంగలు, మాట ఇచ్చి మోసం చేసినోళ్లవి పెట్టాలే. తులం బంగారం ఇచ్చి మోసం చేస్తే ఏం చేయాలే పోలీస్ స్టేషన్లో ఫొటో పెట్టాలే. ఆడవాళ్లందరికీ నెలకు రూ.2500 ఇస్తా అని చెప్పి మోసం చేస్తే ఆ ఫొటోలు పెట్టాలి. అత్తలకు రూ.4 వేలు, కోడళ్లకు రూ.2500 ఇస్తా అని లంగమాటలు చెప్పి ఓట్లేయించుకుంటే వాళ్ల ఫొటోలు పెట్టాలి. రైతులకు రూ.15 వేలు ఇస్తా అని కథలు చెప్పి మరి మోసం చేసి ఓట్లేయించుకుంటే వాళ్ల ఫొటోలు పెట్టాలే. ఇందిరమ్మ రాజ్యంలో అందరికీ పట్టాలిస్తం.. పట్టాలొస్తయని అని చెప్పిండా.. లేదా..? అని అడిగారు. ఎస్టీ, ఎస్సీలు, బీసీలకు అసైన్డ్ భూములకు పట్టాలొస్తయి. ఇదివరకు ఇందిరమ్మ ఇచ్చింది.. ఇప్పుడు మళ్లిస్తం.. పట్టాలియ్యాల్సినోడు మోసం చేస్తే ఆయన ఫొటో పెట్టాల్నా.. మన ఫొటో పెట్టాల్నా పోలీస్ స్టేషన్లో అని అడిగారు.
ఒకటి కాదు రెండు కాదు 420 హామీలు, 420 మాటలు చెప్పి గెలిచి గద్దెనెక్కి ఇవాళ గద్దలెక్క ప్రవర్తిస్తున్నోడిది పెట్టాల్నా.. మనది పెట్టాల్నా ఫొటోలు.. వాళ్లవే పెట్టాలే.. కాబట్టి పోలీసోళ్లు ఫొటో తీసుకుంటే సబితమ్మ చెప్పినట్టు ఈ సారి వస్తే మీ చేతులో ఉన్న సెల్‌ఫోన్‌తో ఆ పోలీసోడి ఫొటో కొట్టండి. అన్నా గుర్తు పెట్టుకుంటం. మా కేసీఆర్ సార్ వస్తుండు.. మీ ఫొటో చూపెడ్తమని చెప్పండి.. అని కేటీఆర్ హితవు పలికారు.
పోలీస్ స్టేషన్లలో పెట్టాల్సింది రౌడీలు, దొంగలు, క్రిమినల్స్ ఫోటోలను..
కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుల ఫోటోలు పెడుతున్నారు.ఈసారి పోలీసోళ్లు రైతులను ఇబ్బంది పెడితే.. వాళ్ల ఫోటోలు తీసి పెట్టుకోండి.
వచ్చేది మళ్లీ మన కేసీఆర్ ప్రభుత్వమే.. రైతుల జోలికి వస్తే ఏ ఒక్క అధికారిని… pic.twitter.com/lPJiofy8UK
— BRS Party (@BRSparty) September 28, 2026
UPI Transactions: యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్.. తాత్కాలిక స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరణ
KTR | పట్టాలివ్వకపోతే ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ రాళ్లతో కొట్టుమన్నడు.. రైతులతో కేటీఆర్
PYL Secretary | భగత్‌సింగ్ స్ఫూర్తితో యువత ఉద్యమించాలి : పీవైఎస్ కార్యదర్శి