అమరావతి : ఏపీ ( Andhra Pradesh) వాసులకు వాతావరణశాఖ మరో గుడ్న్యూస్ తెలిపింది . బంగాళాఖాతంలో మరో వాయుగుండం ( Low-pressure ) ఏర్పడిందని వెల్లడించింది. ఇది మయన్మార్-అండమాన్ మధ్య ఏర్పడిందని, రాగల 12 గంటల్లో తీవ్రగుండంగా మారే అవకాశముందని స్పష్టం చేసింది. వాయుగుండం ప్రభావంతో రాబోయే 72 గంటల్లో రాయలసీమ, కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ అధికారులు వివరించారు.
గంటకు 30-40 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశముందని వివరించారు. గత వారం వాయుగుండం కారణంగా ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిశాయి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి, విశాఖ , తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలో భారీ వర్షపాతం నమోదయ్యాయి. నంద్యాల, చిత్తూరు, పార్వతీపురం మన్యం జిల్లాలో 9 సెంటిమీటర్ల లోపు వర్షం కురిసింది .