CPM Leaders | పోలీసులు సీపీఎం నాయకులను ఎలా లాక్కెళ్లారో చూడండి.. వీడియో
CPM Leaders | సీపీఎం నాయకులపై పోలీసుల దౌర్జన్యం ఎలా ఉందో తెలిపే వీడియో ఒకటి బయటకు వచ్చింది. స్వాతంత్ర దినోత్సవ సమయంలో పోలీసులు నల్గొండ సీపీఎం కార్యాలయం నుండి నాయకులను బలవంతంగా ఈడ్చుకెళ్లి జీపులు, వ్యానుల్లో ఎక్కించారు.
CPM Leaders | డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపుల్లో అధికార పార్టీ నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారని, అర్హులను తొలగించి తమ అనుచరులకు ఇళ్లు కేటాయిస్తున్నారని సీపీఎం నాయకులు ఆరోపిస్తున్నారని తెలిసిందే. ఈ క్రమంలో స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొనేందుకు పార్టీ కార్యాలయానికి వచ్చిన సమయంలో సీపీఎం నాయకులపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు.
సీపీఎం నాయకులపై పోలీసుల దౌర్జన్యం ఎలా ఉందో తెలిపే వీడియో ఒకటి బయటకు వచ్చింది. స్వాతంత్ర దినోత్సవ సమయంలో పోలీసులు నల్గొండ సీపీఎం కార్యాలయం నుండి నాయకులను బలవంతంగా ఈడ్చుకెళ్లి జీపులు, వ్యానుల్లో ఎక్కించారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డబుల్ బెడ్ రూం ఇండ్ల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అడ్డుకుంటారనే అనుమానంతో సీపీఎం నాయకులను అరెస్ట్ చేయడం కాంగ్రెస్ సర్కార్ నిరంకుశ వైఖరి ఎలా ఉందో మరోసారి చెప్పకనే చెబుతోంది.
రాష్ట్ర కమిటీ సభ్యుడు ముదిరెడ్డి సుధాకర్రెడ్డి, జిల్లా నాయకులు ఎండీ సలీం, ఔటరవీందర్లను పోలీసులు అరెస్టు చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య అరెస్టులను తీవ్రంగా ఖండించారు. ఈ అంశాన్ని ప్రశ్నిస్తారనే భయంతోనే తమ నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారని పేర్కొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున పార్టీ నాయకులను అక్రమంగా నిర్బంధించడం దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన అనే చెబుతూనే.. మరోవైపు ప్రజా సమస్యలపై పోరాడుతున్న సీపీఎం నాయకులను అరెస్టు చేయడం సరికాదన్నారు.
సీపీఎం నాయకులపై పోలీసుల దౌర్జన్యం
స్వాతంత్ర దినోత్సవ వేడుకల సమయంలో నల్గొండ సీపీఎం కార్యాలయం నుండి నాయకులను ఈడ్చుకెళ్లిన పోలీసులు
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డబుల్ బెడ్ రూం ఇండ్ల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అడ్డుకుంటారనే అనుమానంతో అరెస్ట్ pic.twitter.com/JYUlCws7oY
— Telugu Scribe (@TeluguScribe) August 15, 2026
Read Also :
Weekend OTT | ఇండిపెండెన్స్ డే స్పెషల్.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన చిత్రాలివే!
FBI Report | అమెరికాలో భారీగా తగ్గిన హత్యల రేటు.. గడిచిన 75 ఏళ్లలో అత్యంత కనిష్ఠం..!
Rosemary Oil | జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రోజ్మేరీ ఆయిల్..అధ్యయనంలో వెల్లడి..
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

