టేకులపల్లి జనవరి 6 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో పోలీసులు భారీగా పటిక, బెల్లం స్వాధీనం చేసుకున్నారు. మండలంలోని లచ్య తండ గ్రామానికి చెందిన ఓ మహిళ నాటుసారా అమ్ముతుందనే సమాచారం మేరకు కొత్తగూడెం ఎక్సైజ్ సిబ్బంది తనిఖీలు చేశారు. ఈ మేరకు టాస్క్ఫోర్స్ ఎస్ఐ గౌతమ్ వివరాలను వెల్లడించారు.
లచ్య తండ గ్రామానికి చెందిన జర్పుల సరోజ వద్ద 180 కిలోల బెల్లం, 50 పటిక, లీటర్ల నాటు సారాను స్వాధీన చేసుకున్నట్ల తెలిపారు. నాటుసారా తయారీకి వాడిన 100 లీటర్ల పానకాన్ని సంఘటన స్థలంలోనే ధ్వంసం చేసి నిందితురాలిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో ఎక్సైజ్ సిబ్బంది హాబీబ్ పాషా, గురవయ్య, సుమంత్, రమేష్, పార్థసారథి పాల్గొన్నారు.