Election Schedule : దేశంలో మళ్లీ ఎన్నికల కోలాహలం మొదలుకాబోతున్నది. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికల కోసం ఇవాళ (ఆదివారం) సాయంత్రం నాలుగు గంటలకు ఎన్నికల కమిషన్ (Election Commission) షెడ్యూల్ (Schedule) విడుదల చేయనుంది. పశ్చిమ బెంగాల్ (West Bengal), తమిళనాడు (Tamil Nadu) తదితర రాష్ట్రాలకు త్వరలో ఎన్నికలు నిర్వహించనున్నారు.
ఈ మేరకు సాయంత్రం 4 గంటలకు ఈసీ మీడియా సమావేశం ఏర్పాటు చేయనుంది. తమిళనాడు, పశ్చిమబెంగాల్, అస్సాం, కేరళ, పుదుచ్చేరిల్లో ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేయనున్నారు. ఆయా రాష్ట్రాల శాసనసభల పదవీకాలం మే, జూన్లలో వేర్వేరు తేదీల్లో ముగియనుంది. ఈ రాష్ట్రాల్లో ఇప్పటికే ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ ముగిసింది. తుది ఓటర్ల జాబితాలను కూడా ప్రచురించారు.
కాగా సంబంధిత రాష్ట్రాల్లో ఇప్పటికే ఎన్నికల హడావుడి మొదలైంది. ప్రధాని నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం రాష్ట్రాలను చుట్టేశారు. పశ్చిమబెంగాల్లో ఈసారి సత్తా చాటాలని బీజేపీ శాయశక్తులా కృషి చేస్తున్నది. తమిళనాడులో అన్నాడీఎంకేతో బీజేపీతో పొత్తు పెట్టుకుంది.