దండేపల్లి : మంచిర్యాల జిల్లాలో సీపీఐ ప్రచార జాత 4వ రోజు జన్నారంలో ప్రారంభమై దండేపల్లి మండల కేంద్రనికి చేరుకుంది. బస్టాండ్ వద్ద జరిగిన కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ మాట్లాడుతూ ఈ నెల 10న రామకృష్ణాపూర్ లో బహిరంగ సభను చేయాలని కోరారు. బహిరంగ సభలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, మాజీ ఎమ్మెల్యే చాడా వెంకట రెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేన శంకర్, వాసిరెడ్డి సీతారామయ్య హాజరై ప్రసంగిస్తారన్నారు. అలాగే జనవరి 18 ఖమ్మంలో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు.
1925 డిసెంబర్ 26న కాన్పూర్లో ఆవిర్భవించి నాడే దున్నేవాడికి భూమి దక్కాలని, భారత స్వాతంత్రం కోసం నిజాం నవాబులను గద్దదించడానికి, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నిర్వహించిన చరిత్ర సీపీఐది అన్నారు. సుమారు 4,500 మంది కమ్యూనిస్టులు ప్రాణ త్యాగాలు చేసి పది లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచి, 3,000 గ్రామాలను విముక్తి చేసిన ఘనమైన చరిత్ర ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు జోగుల మల్లయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు లింగం రవి, జిల్లా సమితి సభ్యులు, కామెర దుర్గారాజ్, దొడ్డిపట్ల రవీందర్, సీపీఐ నాయకులు, మామిడి విజయ్, గునిగంటి నర్సింగరావు, కంచం పోషం, ఉయ్యాల శంకర్, మర్రి సందీప్, తదితరులు పాల్గొన్నారు.