బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు వరంగల్ జిల్లా ముఖద్వారం అయిన పెంబర్తి వద్ద ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సురక్షితమైన రవాణా సేవలు అందించడమే సంస్థ ప్రధాన లక్ష్యమని కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి.సోలోమన్ అన్నారు.
రిటైర్మెంట్ ప్రయోజనాల వెంటనే విడుదల చేయాలని రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీధర్ల ధర్మేంద్ర, కడారి భోగేశ్వర్ డిమాండ్ చేశారు.
నారాయణగిరి గ్రామ శివారులో జరుగుతున్న అక్రమ మైనింగ్ కంపెనీ లను మూసివేసి ఆయా ప్రాంతాల్లో ఉన్న చారిత్రక, ఆధ్యాత్మిక సంపదను కాపాడాలని గ్రామానికి చెందిన ఓ వ్యక్తి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను(Labour Codes) రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని ఇఫ్టూ జాతీయ కన్వీనర్ షేక్షావలి డిమాండ్ చేశారు.
శివనగర్ ప్రాంతంలో శిథిలావస్థకు చేరుకున్న బీసీ హాస్టల్ భవనం కారణంగా స్థానిక ప్రజలు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని 35వ డివిజన్ కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్ తెలిపారు.