న్యూ శాయంపేట, జనవరి 27 : వరంగల్ గ్రేటర్ పరిధి 31వ డివిజన్ నంది హిల్స్ కాలనీలో అంతర్గత సీసీ రోడ్డు పనులకు స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కార్పొరేటర్ మామిండ్ల రాజుతో కలిసి మంగళవారం శంకుస్థాపన చేశారు. రూ.35లక్షలతో అంతర్గత సీసీ రోడ్ల పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. అలాగే న్యూశాయంపేట ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు లంచ్ బాక్సులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ వేల్పుల మోహన్ రావు, నందిహిల్స్ కాలనీవాసులు తోగరు జెగన్ మోహన్ రెడ్డి, సంకు యాకుబ్ రెడ్డి, పసునూటి సురేష్, పొగాకుల శ్రీనివాస్, దుర్గారావు, జెగన్ మోహన్ రెడ్డి, సుదీర్ రెడ్డి, రావుల శ్రీధర్ పాల్గొన్నారు.