కీసర, జనవరి 27 : సీఐటీయు- ఐఎఫ్టీయు జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మికుల హక్కుల కోసం సమ్మె నిర్వహిస్తున్నామని సీఐటీయు మండల కార్యదర్శి బంగారు నర్సింగ్‌రావు అన్నారు. ఈ మేరకు కీసర సర్కిల్ డిప్యూటీ కమిషనర్ వసంతకు సీఐటీయు నేతలు సమ్మె నోటీసును అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను కుదించి నాలుగు లేబర్ కోడ్లుగా అమలు చేయాలని జారీచేసిన విజిట్ నోటిఫికేషన్లు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
కార్మిక చట్టాలను పరిరక్షించి కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. వచ్చే నెల ఫిబ్రవరి 12న జరిగే జాతీయ సమ్మెను కార్మికులందరు కలిసి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు శివబాబులు చింతకింది అశోక్ తదితరులు పాల్గొన్నారు.