మల్కాజిగిరి, జనవరి 26 : భారత రాజ్యాంగ విలువలు కాపాడుతూ, ప్రజాస్వామ్యం బలోపేతానికి కృషిచేయాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మల్కాజిగిరిలోని పలు ప్రాంతాలు, కార్యాలయాలు, కాలనీలలో సోమవారం జెండా ఆవిష్కరణలు నిర్వహించారు.
ఈ కార్యక్రమాలకు హాజరై జెండాలు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోనే భారత రాజ్యాంగం అత్యుత్తమైందన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.