భీమదేవరపల్లి, జనవరి, 26 : అలిగి రెడ్డి కాశి విశ్వనాధ రెడ్డి జూనియర్ డిగ్రీ కళాశాల రజతోత్సవ వేడుకలు హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో సోమవారం ఘనంగా జరిగాయి. భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను కళాశాల ప్రిన్సిపల్ భూపతి శ్రీకాంత్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కళాశాలలు విద్యా కుసుమానికి సోపానాలు అన్నారు.
కళాశాలల్లోనే జీవన గమనము, ప్రతిభ, లక్ష్యము తెలుస్తాయని గుర్తు చేశారు. ప్రతి విద్యార్థి అంతిమ లక్ష్యాలను ఛేదించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏ సుదర్శన్ రెడ్డి, ఎస్సై రాజు, డాక్టర్ సుధాకర్, స్థానిక సర్పంచ్ జాలి ప్రమోద్ రెడ్డి ఉపసర్పంచ్ మమత, ఎంఈఓ సునీతా రాణి, కళాశాల అధ్యాపక బృందం విద్యార్థులు పాల్గొన్నారు.