నర్సింహులపేట : యాసంగి పంటలు సాగు చేసిన రైతులను నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం నుంచి వెళ్తున్న ఆకేరువాగులో నీరు లేకపోవడం ఇబ్బందిగా మారింది. ఎస్సారెస్పీ కాలువకు నీళ్లు రాకపోగా మరోవైపు భూగర్భ జలాలు అడుగంటాయి. ఈ పరిస్థితుల్లో పంటలను కాపాడుకునేందుకు రైతులు నానాపాట్లు పడుతున్నారు.
నర్సింహులపేట మండలం రూప్లాతండా జీపీ పరిధిలోని ఎర్రచకృతండాకు చెందిన జాటోత్ సంతోష్, వెంకన్న అన్నదమ్ములు. వీరు 4 ఎకరాల్లో వరి సాగు చేశారు. తీరా పొట్టదశలో నీరందక ఎండిపోతుండటంతో మంగళవారం రూ. 50 వేల చొప్పున ఖర్చు చేసి రెండు బోర్లు వేసినా చుక్కనీరు రాలేదు.